మీడియాలో వచ్చే వార్తలకు విశ్వనీయత ఉంటుంది. పాఠకులు నమ్మేస్తారు. అయితే వార్తలు ప్రచురించే ముందు నిజమా, కాదా అని నిర్దారణ చేసుకోవాలి. సినిమాల విషయానికి వస్తే వాటి పిఆర్వోలు పంపే వార్తలు గుడ్డిగా నమ్మేసి ప్రచురిస్తుంటారు. సినిమా పీఆర్వోలు నిజమైన సమాచారం ఇస్తారనే ఉద్దేశంతోనే పరిశీలన చేయరు. మంగళవారం వివిధ దినపత్రికల్లో 'ఎమ్మెల్యే' (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) సినిమా వార్త ప్రచురించారు.
ఈ చిత్రం షూటింగ్ మొదలైంది అనేది వార్త సారాంశం. అయితే 'ఎమ్మెల్యే' సినిమా షూటింగ్ అసలు మొదలేకాలేదు. నెల రోజుల క్రితం కేవలం పూజ నిర్వహించారు. ఈ నెల 9 నుండి షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది వాస్తవం కాగా పత్రికల్లో మాత్రం షూటింగ్ మొదలైందని వార్త వచ్చింది. సహజంగా మీడియాలో పాత వార్తలను పక్కన పెట్టేస్తారు. ఎప్పుడో జరిగిన పూజా కార్యక్రమాన్ని నిన్ననే జరిగినట్టు బిల్డప్ ఇచ్చారు. ఇదీ మన తెలుగు పత్రికల్లో వస్తున్న సినిమా వార్తల తీరు.




 
                     
                      
                      
                     
                     'డిజె' బన్నీకి హ్యాట్రిక్ హిట్ అంటా..!
 'డిజె' బన్నీకి హ్యాట్రిక్ హిట్ అంటా..! 

 Loading..
 Loading..