Advertisement

క్షమాపణలు చెప్పిన అనసూయ..!

Wed 31st May 2017 12:22 PM
  క్షమాపణలు చెప్పిన అనసూయ..!
Anasuya Responded on Comedy Shows..! క్షమాపణలు చెప్పిన అనసూయ..!
Advertisement

గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఛానల్స్ లో కామెడీ షోస్ పేరుతొ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో కొన్ని ప్రోగ్రామ్స్ ప్రసారమవుతున్నాయి. ఇలాంటి షోస్ ని బ్యాన్ చెయ్యాలంటూ మానవ హక్కుల సంఘానికీ ఫిర్యాదులు వెళ్లాయి. జబర్దస్త్, పటాస్ వంటి షోలపై కత్తి కట్టిన నెటిజన్లు వాటిని బ్యాన్ చెయ్యాలని పోరాటానికి దిగారు. ఈ షోస్ చేసే యాంకర్స్ దగ్గర నుండి జడ్జీల వరకు ఈ వల్గారిటీ షోస్ నుండి తప్పుకోవాలని వత్తిడి చేస్తున్న తరుణంలో జబర్దస్త్ కామెడీ షో కి యాంకరింగ్ చేస్తున్న హాట్ యాంకర్  అనసూయ తన స్పందనను తెలియజేసింది. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన అనసూయ ఆ షోస్ మీద తన ఒపీనియన్ ని తెలియజేసింది. 

ఒక షో మీద ఇంట్రెస్ట్ ని పెంచడానికి ఆ షో నిర్వాహకులు ఆ షో నుండి కొన్ని సన్నివేశాలతో కూడిన ప్రోమోలను కట్ చేసి వాటిని యాడ్స్ రూపంలో ప్లే చేస్తుంటారు. కానీ కొన్ని రోజుల నుండి ఆ ప్రోమోస్ గతితప్పి డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నింపేసి ప్లే చెయ్యడంతో ఆయా షోస్ మీద నెగెటివ్ ఫీలింగ్ వచ్చేస్తుందని అంటుంది. అయితే అది కేవలం ఎడిటింగ్ లో ఉన్న లోపం అని... అసలేం జరిగిందో తెలియకుండా ఎవరైనా ఆ ప్రోమో చూస్తే.. ఏంటి ఈ నాన్‌సెన్స్ అనే అనుకుంటారు అంతా. ప్రోగ్రామ్‌ను చూసేయాలన్న ఉద్దేశంతో ప్రోమోలను కట్ చేసేసి పక్కదారి పట్టేలా చేస్తున్నారు. నేను చేస్తున్న జాక్ పాట్ ప్రోగ్రాం లో కూడా ఇదే తరహా ప్రోమోస్ ప్లే అవడము... నేను వాళ్ళకి ఇలా బాగోలేదని చాలా సార్లు చెప్పడము జరిగిందని చెబుతుంది. నా టీముకున్న సమన్వయ లోపం వలెనే నాలో అసహనం పెరిగిందని అందుకే మీకు క్షమాపణలు చెబుతున్నాని అని చెప్పింది.

అసలు కామెడీ అనేది ప్రస్తుతం వల్గారిటీ లెవల్ కి వెళ్లిపోయిందని.... అలాంటి షోస్ వల్ల తనకే మాత్రం సంతోషం లేదని... కానీ ఇదంతా తన ఒక్కదాని చేతిలో లేదని... ఎన్నో సార్లు ఇలాంటి ప్రోమోల గురించి డైరెక్టర్‌కు చెప్పానని వెల్లడించారు. ఆది గెస్ట్‌గా వచ్చిన ప్రోగ్రాంలో ఎడిటింగ్‌ను అలా చేసి ఉండాల్సింది కాదని, ఆ ప్రోమోకు సంబంధించి తనకే బాధ్యతా లేదని స్పష్టం చేశారు. అది తన తప్పు కాదని చెప్పారు. సైలెంట్ గా ఉంటే ఆ వల్గారిటిని నేను సపోర్ట్ చేసినట్లు అవుతుందని...అందుకే  క్షమాపణ చెబుతున్నాని అంటుంది.

Anasuya Responded on Comedy Shows..!:

In some channels over the past few years, some programs with the double showings dialogues are titled Comedy Shows. Anasuya who apologized to the audience through Facebook Live gave her opinion on the shows.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement