'బాహుబలి' ఊపు మామూలు కాదయ్యా..!

Tue 23rd May 2017 08:29 PM
akshay kumar,ranveer kapoor,shekhar kapoor,anil kapoor,baahubali 2,rajamouli  'బాహుబలి' ఊపు మామూలు కాదయ్యా..!
Bollywood Star Heroes Compliments on Baahubali Film 'బాహుబలి' ఊపు మామూలు కాదయ్యా..!
Sponsored links

'బాహుబలి'పై ఇంకా పొగడ్తల జోరు పెరుగుతూనే ఉంది. నిన్నటి దాకా మౌనంగా ఉన్న బాలీవుడ్‌ ఇండస్ట్రీ ముఖ్యులు కూడా ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అక్షయ్‌ కుమార్‌, రణవీర్‌ కపూర్‌, శేఖర్‌ కపూర్‌లే గాక దిగ్గజం రిషీకపూర్‌ సైతం మాహిష్మతి రాజ్యంలో తనకు ఓ డబుల్‌ బెడ్‌రూం ప్లాట్‌ అడిగాడు. ఇక తాజాగా మరో సీనియర్‌ హీరో అనిల్‌కపూర్‌ 'బాహుబలి'ని ఆకాశానికెత్తేశాడు. ఈ చిత్రం దెబ్బతో బాలీవుడ్‌ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం టాలీవుడ్‌ వైపు చూస్తోందన్నాడు. 

టాలీవుడ్‌లో క్రమశిక్షణ, పట్టుదల, సాంకేతిక నిపుణులను ఆకాశానికి ఎత్తేశాడు. ఇక తనకు మంచి అవకాశాలు వస్తే టాలీవుడ్‌ చిత్రాలలో సైతం నటిస్తానని తెలిపాడు. ముఖ్యంగా నటునిగా తన ఎంట్రీ టాలీవుడ్‌ నుంచే జరిగిందని, 'వంశవృక్షం' గురించి ప్రస్తావిస్తూ, స్వర్గీయ దర్శకుడు బాపుపై ప్రశంసలు కురిపించాడు. నిజంగా 'వంశవృక్షం' చిత్రం ఓ కళాఖండం. మహిళలు భర్తలను కోల్పోయిన తర్వాత వారు మరలా పున: వివాహం చేసుకొనే ఇతి వృత్తంతో ఆనాడే ఈ చిత్రం సంచలనం సృష్టించింది. మొత్తానికి అనిల్‌ కపూర్‌ 'బాహుబలి'తో పాటు బాపుని కూడా స్మరించుకోవడం సంతోషాన్ని కలిగించే విషయమే...! 

Sponsored links

Bollywood Star Heroes Compliments on Baahubali Film:

Still on the 'Baahubali' is Compliments growing. Bollywood industry chiefs who have been silent till yesterday are also compliments shouting on the film .

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019