రజినీకాంత్ తర్వాత ప్రభాసేనా..!

After Rajinikanth, South Famous Actor is Prabhas

Thu 18th May 2017 09:23 PM
Advertisement
rajinikanth,prabhas,ss rajamouli,baahubali,south indian star heroes,chiranjeevi  రజినీకాంత్ తర్వాత ప్రభాసేనా..!
After Rajinikanth, South Famous Actor is Prabhas రజినీకాంత్ తర్వాత ప్రభాసేనా..!
Advertisement

దక్షిణాదిలో రజనీ, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌లాల్‌, కమల్‌హాసన్‌ వంటి స్టార్స్‌ ఉండవచ్చు. ఇక ఆ తర్వాత అజిత్‌, విజయ్‌, పవన్‌, ప్రభాస్‌, మహేష్‌,ఎన్టీఆర్‌, బన్నీలు ఉండవచ్చు. కానీ నిన్నటి స్టార్స్‌లో రజనీకే తమిళంతో పాటు సమానమైన మార్కెట్‌ టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో ఉంది. ఈ విషయంలో ఆయనకు చేరువగా ఎవ్వరూ లేరు. 

ఇక అజిత్‌, విజయ్‌లలాగా పవన్‌, మహేష్‌లు కేవలం టాలీవుడ్‌లోనే స్టార్స్‌గా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రభాస్‌కు రాజమౌళి, 'బాహుబలి' పుణ్యమా? అని అన్ని వుడ్‌లలో మార్కెట్‌ వచ్చింది. కానీ ఇది రాజమౌళి ఘనత అని, వచ్చే సినిమాల తర్వాత కానీ ప్రభాస్‌ రేంజ్‌ ఏమిటో చెప్పడం కష్టం అనేది కూడా సరైన వాదనే. అయినా లుక్‌ పరంగా, ఒడ్డుపొడుగు.. ఇలా ఎలా చూసుకున్నా రజనీ తర్వాత మరలా బాలీవుడ్‌లో వారి హీరోలలా కనిపించి, నిలబడే సత్తా ప్రభాస్‌కు ఉన్నట్లే కనిపిస్తోంది. 

ఇకపై చిత్రాలను కూడా ఆచితూచి ఒప్పుకుని, మంచి మంచి దర్శకులతో చిత్రాలు చేస్తే ప్రభాస్‌ రజనీ తర్వాత ఉత్తరాదిలో సత్తా చూపించే మొనగాడు అవ్వడం ఖాయం. ఇక మిగిలిన వారు కేవలం టాలీవుడ్‌లోనూ కావాలంటే కోలీవుడ్‌, మాలీవుడ్‌లకే మిగిలిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. 

Advertisement

After Rajinikanth, South Famous Actor is Prabhas:

Young Rebel Star Prabhas is International Star after Baahubali Movie. He is the Second South Indian Superstar After Rajini. 

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement