'బాహుబలి'పై ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు!

Thu 18th May 2017 08:30 PM
baahubali,bollywood heroes,akshay kumar,shahrukh khan,ranvir singh,baaahubali 2,praise  'బాహుబలి'పై ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు!
Baahubali 2 Praised by Bollywood Heroes 'బాహుబలి'పై ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు!
Sponsored links

'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రం విడుదలై మూడు వారాలవుతోంది. ఈ మూడు వారాలుగా దేశం మొత్తం బాహుబలి మేనియాలో మునిగిపోయింది. ఇక టాలీవుడ్‌ స్టార్స్‌ లెజెండ్సే కాదు.. కోలీవుడ్‌కి చెందిన అజిత్‌, రజనీ, శంకర్‌.. ఇలా అందరూ ఇదే ఊపులో ఉండిపోయారు. ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ ఖాన్‌ త్రయం తో పాటు దేశాన్ని పాలించాలని భావించే ఉత్తరాదికి చెందిన స్టార్స్‌, మేకర్స్‌, క్రిటిక్స్‌ అందరూ మౌనంగా ఉన్నారు. 

కానీ అనూహ్యంగా ఈ చిత్రం రోజు రోజుకూ తన గ్రాఫ్‌ను పెంచుకుంటూ ఎవ్వరూ మాట్లాడకుండా ఉండలేని స్థితిని, మెచ్చుకోకుంటే కుళ్లుకుంటున్నారనే వాదనను తెరపైకి తెచ్చేలా చేసింది. దీంతో సినిమాను మొదట తన చెత్త వాగుడుతో ఉతికి ఆరేసిన కమాల్‌ ఆర్‌ ఖాన్‌ కూడా క్షమాపణ చెప్పాడు. శేఖర్‌కపూర్‌ ఎప్పుడో కితాబిచ్చాడు. ఇక ఇప్పుడు అక్షయ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని ఆకాశానికెత్తేశాడు. ఈ చిత్రం చూడటం ఇంతకాలానికి వీలైనదంటూ తనదైన శైలిలో పొగడ్తలు కురిపించాడు. 

మరో బాలీవుడ్‌స్టార్‌ రణవీర్‌ సింగ్‌ కూడా వావ్‌.. బా..హు..బ...లి...అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇక కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ కూడా ఈ చిత్రాన్ని మట్టిలో మాణిక్యంగా పొగిడాడు. ఇలాంటి చిత్రాలు తీయడానికి ఎన్నో గట్స్‌ ఉండాలంటూ రాజమౌళిని ఆకాశానికెత్తేశాడు. అయినా ఇంతకీ కింగ్‌ఖాన్‌ ఇప్పుడు చూసింది కేవలం 'బాహుబలి1' మాత్రమేనట. ఇక 'బాహుబలి-దికన్‌క్లూజన్‌' చూసిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతాడో వేచిచూడాల్సివుంది....! 

Sponsored links

Baahubali 2 Praised by Bollywood Heroes:

Finally, Bollywood heroes started lauding the movie and its Brobdingnagian success.

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019