మహేష్ ఆఫర్ కి నయనతార ఓకే అంటుందా..?

Tue 16th May 2017 09:10 PM
mahesh babu,nayantara,director murugadoss,spyder movie,rakul preet singh  మహేష్ ఆఫర్ కి నయనతార ఓకే అంటుందా..?
Nayantara in Mahesh Babu Film Spyder! మహేష్ ఆఫర్ కి నయనతార ఓకే అంటుందా..?
Sponsored links

మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బైలింగ్యువల్ మూవీ 'స్పైడర్' షూటింగ్ ఈ మధ్యన కొన్ని కారణాల వల్ల డిలే అవుతుందనే టాక్ నడుస్తుంది. మురుగదాస్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చెయ్యడంతో షూటింగ్ ఆలస్యమైందని.... ఈ విషయమై మహేష్ కూడా మురుగదాస్ పై గుర్రుగా ఉన్నాడనే వార్తలొస్తున్నాయి. ఇక ఇప్పుడు 'స్పైడర్' గురించి ఒక ఆసక్తికర విషయమొకటి వెలుగులోకొచ్చింది. అదే మిటంటే మహేష్ స్పైడర్ లో స్టార్ హీరోయిన్ నయనతార ఒక కీ రోల్ పోషించబోతుందని టాక్ వినబడుతుంది. 'స్పైడర్' లో ఒక ఇంపార్టెంట్ రోల్ కి నయనతార అయితే బావుంటుందని మురుగదాస్ ఆమెని అప్రోచ్ అవడానికి రెడీ అయ్యాడని అంటున్నారు. 

ఇప్పటికే మహేష్ చిత్రం కోసం మురుగదాస్ చాలా మంది స్టార్స్ ని తీసుకున్న విషయం తెలిసిందే. తమిళ్ యాక్టర్ భరత్ ఒక ముఖ్యపాత్ర చేస్తుండగా డైరెక్టర్ సూర్య విలన్ రోల్ పోషిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ టైం మహేష్ కి జోడిగా నటిస్తుంది. ఇప్పుడు నయనతార కూడా ఈ చిత్రంలో నటిస్తే భారీ తారాగణంతో 'స్పైడర్' చిత్రాన్ని మనం చూడొచ్చు. అయితే నయనతార ఈ ఆఫర్ కి ఎస్ చెబుతుందో లేదో అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. అయితే నయనతారకి మురుగదాస్ 'గజినీ' లో ఛాన్స్ ఇవ్వడం వలన ఆమె కెరీర్ కి అది చాలా ప్లస్ అయ్యింది. అందుకే మురుగదాస్ మీద ఉన్న అభిమానంతో నయన్ ఈ ఆఫర్ కి నో చెప్పదని భావిస్తోందట చిత్ర యూనిట్. 

Sponsored links

Nayantara in Mahesh Babu Film Spyder!:

Mahesh - Murugadoss's combination of bilingual movie 'Spyder' shooting is going to be delayed due to some reasons. In the 'spyder', it is said that he would be better to get an apprentice roll as if Director Murugadoss was going to approach him.

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019