ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఎప్పుడు ఏమీ మాట్లాడుతున్నాడో, ఏమీ చేస్తున్నాడో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. దాంతో ఆయన నవ్వులపాలవుతూ, సెటైర్లు పడే స్థాయికి చేరి, సోషల్ మీడియాలో కూడా ఎగతాళి అయిపోయాడు. ఆయన్ను ఇప్పుడు అందరూ పప్పు అంటున్నారు. ఆయన ఉపన్యాసాలలో కూడా మొదటి వాక్యానికి, రెండో వాక్యానికి లింక్ కుదరడం లేదు.
ఒకదానికొక్కటి సంబంధం లేకుండా, లింక్ తెంపి మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఏదైనా అనర్ఘళంగా, పక్కవారికి తప్పులు దొరకకుండా వాగ్దాటిని చూపించడం రాజకీయ నాయకులకు ఉండవలసిన మొదటి లక్షణం. కానీ ఆయన అలా చేయలేకపోతున్నాడు. సభలు, సమావేశాలు, కార్యకర్తలతో ముచ్చట్లు, ఏదైనా దుర్ఘటన జరిగితే పరామర్శించడాలు చేస్తూ ప్రజలలోనే గడుపుతున్నా ఆయన ఆకట్టుకోలేకపోతున్నాడు.
అందుకే ఆయన తనకు ప్రసంగాలు రాసి ఇవ్వడం, మాట్లాడేటప్పుడు హావభావాలు చూపుతూ, అనర్ఘళంగా ప్రసంగించడం, బాడీ లాంగ్వేజ్ వంటి వాటిని మార్చుకోవాలనే మంచి నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఆయన ప్రముఖ కవి, జర్నలిస్ట్, నాటక రంగ నిఫుడుడైన పెద్ది రామారావు అనే సహాయకుడిని నియమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన ఈయన హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో థియేటర్ ఆఫ్ ఆర్ట్స్‌లో పనిచేస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈయన దేవదాసు కనకాల కుమారుడు రాజీవ్ కనకాల సోదరిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన రాజీవ్ కనకాలకు స్నేహితుడైన జూనియర్ ఎన్టీఆర్‌కు గతంలో ఎన్నికల సమయంలో తెలుగుదేశంకు అనుకూలంగా ప్రచారం చేసినప్పుడు ఉపన్యాసాలను, ఇతర విషయాలను ఈయనే దగ్గరుండి చూసుకునే వాడట. మొత్తానికి ఇప్పుడు ఆయన లోకేష్ వెన్నంటి ఉన్నాడని తెలుస్తోంది. మరి ఈయన పుణ్యానైనా లోకేష్ దారిలో పడతాడేమో చూడాల్సివుంది...!




పవన్ గురించిన నిజాలు చెప్పిన దర్శకుడు..! 
Loading..