బాలయ్య బీభత్సం మొదలైంది..!

Balakrishna's Film Sold out for Record Satellite Price

Mon 08th May 2017 06:29 PM
Advertisement
balakrishna,puri jagannadh,satellite rights,gemini tv  బాలయ్య బీభత్సం మొదలైంది..!
Balakrishna's Film Sold out for Record Satellite Price బాలయ్య బీభత్సం మొదలైంది..!
Advertisement

బాలకృష్ణ తన 100 వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో హిట్ కొట్టాక 101వ చిత్రాన్ని ఎవరితో చేస్తాడో? ఎలాంటి సబ్జెక్టు ని ఎన్నుకుంటాడో? అని అందరూ ఆలోచనలో ఉండగా.... బాలకృష్ణ 101 వ చిత్రాన్ని బోయపాటి డైరెక్ట్ చేస్తాడని ఒకసారి కాదు కాదు ఎస్ వి కృష్ణారెడ్డి అని ఒకసారి...ప్రచారం జరుగుతున్న వేళ అనూహ్యంగా పూరి తో సినిమా అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు బాలయ్య బాబు. అయితే వీరిద్దరి కాంబినేషన్ మీద నందమూరి ఫ్యాన్స్  చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. పూరి జగన్నాథ్ తనేమనుకున్నాడో అదే సినిమాగా చూపించేస్తాడు. అది ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో కూడా ఆలోచించడు.

కానీ బాలకృష్ణ కి అలా చేసేటటువంటి వ్యక్తులంటే నచ్చదని రూమరుంది. మరి అలాంటి వారి కాంబినేషన్ లో చిత్రం అంటే అందరిమనసుల్లోఒకటే అనుమానాలు. ఇక ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ వీరిద్దరూ తమ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లిపోవడమూ..... అప్పుడే సినిమా షూటింగ్ సగం ముగించేయడము జరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తారా స్థాయిలో జరుగుతున్నట్టు సమాచారం. అలాగే ఈ చిత్ర శాటిలైట్ హక్కులు జెమిని ఛానెల్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి.

దాదాపు 9  కోట్లు బాలయ్య - పూరి చిత్రానికి శాటిలైట్ హక్కులు అమ్ముడు పోయినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29 న విడుదల చేస్తున్నట్లు పూరి ఎప్పుడో చెప్పాడు.

Advertisement

Balakrishna's Film Sold out for Record Satellite Price:

Reports say, Balayya and Puri Jagan movie's satellite rights have been sold out to a whopping price of Rs.9 crores to Gemini TV. This is said to be a record among Balakrishna's films.

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement