మంచు లక్ష్మీ.. మరి వారినేం చేయాలి!

Mon 08th May 2017 05:46 PM
manchu lakshmi,nirbhaya case,supreme court,manchu lakshmi shocking comments  మంచు లక్ష్మీ.. మరి వారినేం చేయాలి!
Manchu Lakshmi shocking comments on Nirbhaya Convicts మంచు లక్ష్మీ.. మరి వారినేం చేయాలి!
Sponsored links

నిర్భయ కేసులో సదరు అఘాయిత్యానికి పాల్పడిన వారికి సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధించడంతో ఇకనైనా ఇలాంటి దురాగతాలకు పాల్పడే వారికి భయమేస్తుందని కొందరు ఆశగా ఎదురుచూస్తున్నారు. సుప్రీం తీర్పును మేనకాగాంధీ, రవిశంకర్‌ ప్రసాద్‌ వంటి కేంద్రమంత్రులే గాక ఉరిశిక్షను తీవ్రంగా వ్యతిరేకించే బృందాకారత్‌ వంటివారు కూడా స్వాగతించారు. మరోవైపు ఈ సంఘటనలో మరో దోషి అయిన మైనర్‌ బాలుడిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మహిళలను సినిమా పోస్టర్‌లో కాస్త ఇబ్బందిగా చూపించినందుకు ఎగిరిపడిన మంచు లక్ష్మి మాత్రం వారికి ఉరిశిక్ష విధించడం తప్పని వాదిస్తోంది. 

సదరు వ్యక్తులకు మార్పు చెందే అవకాశం కల్పించాలని, స్త్రీల గొప్పదనాన్ని వారికి వివరించాలని కోరుతోంది. ఆ పాశవిక మానభంగంలో దోషులు కేవలం మానభంగమే చేయలేదు. ఆమెను ఓ ఆటవస్తువుగా భావించి, చిత్ర వధ చేసి చంపారు. మరి అలాంటి వారికి ఎలాంటి కౌన్సిలింగ్‌ ఇవ్వాలి? అనేది అర్ధం కాని అంశం. కాబట్టి ఇప్పటికీ బతికే ఉన్న మైనర్‌ దోషిని, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఆడవారి గొప్పదనం తెలియజేసేందుకు మంచు లక్ష్మి వంటి వారు ఏదైనా స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేస్తే మంచిది. 

Sponsored links

Manchu Lakshmi shocking comments on Nirbhaya Convicts:

Manchu Lakshmi stated that 'The convicts were humans too and death penalty is not fair and instead of imposing death sentence the convicts should be taught value of women. I think a second chance should be given to the convicts so that they would realize the mistake they have done'.

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019