Advertisementt

మరో యువ దర్శకునితో మెగాహీరో..!

Sun 16th Apr 2017 09:18 PM
director sankalp reddy,varu tej,fida movie,director sekhar kammula  మరో యువ దర్శకునితో మెగాహీరో..!
మరో యువ దర్శకునితో మెగాహీరో..!
Advertisement
Ads by CJ

మెగాహీరో వరుణ్‌తేజ్‌ నటించిన తాజా చిత్రం 'మిస్టర్‌' ఫ్లాప్‌ అయింది. ఇక 'ముకుంద, కంచె' చిత్రాలు ఎలా ఆడినప్పటికీ అవి ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.కానీ కేవలం కమర్షియల్‌ చిత్రాలు చేయాలని ఆయన ఆశపడిన 'లోఫర్‌, మిస్టర్‌' చిత్రాల ఫ్లాప్‌ వల్ల వరుణ్‌తేజ్‌ డెసిషన్‌లో ఇక భారీ మార్పులు తధ్యమంటున్నారు. తనకు రొటీన్‌ మాస్‌ యాక్షన్‌ చిత్రాల కంటే విభిన్నచిత్రాలే మంచి బాటను వేస్తాయనే నిర్ణయానికి ఈ మెగాహీరో వచ్చాడట. 

ఇక ప్రస్తుతం వైవిధ్యచిత్రాల దర్శకుడు శేఖర్‌కమ్ములతో ఆయన 'ఫిదా' అనే విభిన్న చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత కూడా ఆయన మరో ఇద్దరు యువ దర్శకులతో పనిచేస్తున్నాడు. ఈ రెండు కూడా విభిన్న చిత్రాలే అని సమాచారం. కొత్త దర్శకుడు వెంకీతో ఆయన చేయనున్న చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. తాజాగా ఆయన 'ఘాజీ' వంటి వెరైటీ చిత్రాన్ని తన మొదటి చిత్రంగా చేసి లాభాలతో పాటు ప్రశంసలు కూడా పొందిన సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి అంగీకరించాడని సమాచారం. 

మొదట సంకల్ప్‌ 'ఘాజీ' తర్వాత తొందరపడకుండా స్టోరీలపై కసరత్తు చేస్తున్నాడు. విక్టరీ వెంకటేష్‌ కోసం కూడా ఓ స్టోరీ తయారు చేసే పనిలో ఉన్నాడని సమాచారం. కానీ అనుకోకుండా మధ్యలో సంకల్ప్‌ తన రెండో చిత్రాన్ని వరుణ్‌తేజ్‌తో చేయాలని, ఇది విభిన్న బ్యాక్‌డ్రాప్‌ ఉన్న చిత్రమేనని సమాచారం. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ