Advertisementt

యంగ్‌ రెబెల్‌స్టార్‌ క్లారిటీ ఇచ్చేశాడు..!

Sun 16th Apr 2017 08:37 PM
prabhas,baahubali 2 movie,prabhas next movie sahoo,director sujith,uv creations banner  యంగ్‌ రెబెల్‌స్టార్‌ క్లారిటీ ఇచ్చేశాడు..!
యంగ్‌ రెబెల్‌స్టార్‌ క్లారిటీ ఇచ్చేశాడు..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రం రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో బాహుబలి టీం ప్రమోషన్స్‌ వేగం పెంచింది. ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతూ, ప్రస్తుతం తాను 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' విడుదల కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇక 'బాహుబలి' రెండు పార్ట్‌ల కోసం కొన్నేళ్లుగా కష్టపడుతోన్న ప్రభాస్‌ 'మిర్చి' తర్వాత దానికే పరిమితమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన మదర్‌ సంస్థలాంటి యువి క్రియేషన్స్‌ బేనర్‌లో సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇక తనకు 'బాహుబలి' ద్వారా వచ్చిన ఇమేజ్‌ను, టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో వచ్చిన క్రేజ్‌కు అనుగుణంగా తన తదుపరి చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి 'సాహో' అనే టైటిల్‌ను పెట్టారని, 150కోట్ల బడ్జెట్‌తో రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను ప్రభాస్‌ ఒప్పుకున్నాడు. తన తర్వాతి చిత్రానికి 'సాహో' అనే టైటిల్‌ను పెట్టామని, ఇక ఈ చిత్రాన్ని 150కోట్ల భారీ బడ్జెట్‌తో పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు ఆయన అంగీకరించాడు. 

ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, టైటిల్‌ను మాత్రం త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామన్నాడు. సో.. ఈ ఫస్ట్‌లుక్‌తో పాటు ముందుగా తయారు చేస్తున్న 'సాహో' టీజర్‌ సైతం ఏప్రిల్‌ 28న 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌'తో పాటు రిలీజ్‌ చేస్తారనే వార్తలు మరింతగా ఊపందుకున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ