జీ ఛానల్ అస్సలు తగ్గట్లే..!

Sat 15th Apr 2017 06:11 PM
zee channel,satellite rights,spyder,dj duvvada jagannadham  జీ ఛానల్ అస్సలు తగ్గట్లే..!
జీ ఛానల్ అస్సలు తగ్గట్లే..!
Sponsored links

మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్ర శాటిలైట్ హక్కులను జీ టీవీ తెలుగు, తమిళ, హిందీ భాషలకు కలిపి 26.5  కోట్లకు కొనేసింది. మహేష్ చిత్రాలలో అన్నిటీలో 'స్పైడర్' చిత్రమే ఎక్కువ శాటిలైట్ హక్కుల ద్వారా  సంపాదించింది. ఇక ఇప్పుడు జీ టీవీ మరో చిత్రాన్ని కూడా భారీ ధరకు శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. 

అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డీజే' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే అల్లు అర్జున్ కి అనారోగ్య కారణంగా ప్రస్తుతానికి షూటింగ్ కి బ్రేక్ పడ్డ 'డీజే దువ్వాడ జగన్నాథం' చిత్రం జులై మొదటి వారంలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు చెబుతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందనే టాక్ వినబడుతుంది. ఈ చిత్రానికి సంబందించిన శాటిలైట్ హక్కులను దిల్ రాజుతో ఉన్న తత్సబంధాలు కారణంగా భారీ ధరకు జీ ఛానెల్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అయితే టైటిల్ లాంచ్ రోజునే ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ ఛానెల్ చేజిక్కించుకున్నట్లు చెబుతున్నారు. 

అయితే ఎంత ధరకు డీజే శాటిలైట్ హక్కులు అమ్ముడు పోయాయనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. మరి బన్నీకి కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న డిమాండ్ ను బట్టే డీజే శాటిలైట్ హక్కులు భారీ ధరకు వారు కొనుగోలు చేసినట్లు మాత్రం ప్రచారం జరుగుతుంది.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019