వావ్..!వర్మ కి ఇంత బుద్దేలా వచ్చిందో..?

Fri 14th Apr 2017 04:34 PM
Advertisement
director ram gopal varma,chiranjeevi,pawan kalyan,nagababu  వావ్..!వర్మ కి ఇంత బుద్దేలా వచ్చిందో..?
వావ్..!వర్మ కి ఇంత బుద్దేలా వచ్చిందో..?
Advertisement

ఈ మధ్యన ట్విట్టర్ పిచ్చోడు రామ్ గోపాల్ వర్మ బాగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ట్విట్టర్ లో దుమ్మెత్తిపోసే వర్మ మడమ తిప్పాడు.  ఇంతకుముందు అందరిని విమర్శిస్తూ ట్వీట్స్ చేసే వర్మ  ఇప్పుడు అందరికి సారీ లు చెప్పడం మొదలు పెట్టాడు. ఎదో వోడ్కా తాగిన మత్తులో అలా ట్వీట్స్ చేసి అందరిని బాధపెట్టానని... ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని తాను పెట్టిన కామెంట్స్ కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాడు. ఇదంతా నిజమే. రామ్ గోపాల్ వర్మ ఇదివరకు పెట్టిన కాంట్రవర్సీ ట్వీట్స్ తో బాధపడిన అందరికి పేరు పేరునా వరసబెట్టి క్షమాపణలు చెప్పుకుంటూ వస్తున్నాడు.

ఇక ఇప్పుడు ఈ రోజు మెగా ఫ్యామిలీకి సారీ చెబుతూ ట్వీట్ చేశాడు. ఎప్పుడూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి.. చిరంజీవి దగ్గర నుండి పవన్ కళ్యాణ్ వరకు వరసబెట్టి ట్వీట్స్ తో వేధించిన వర్మ ఇప్పుడు ఉన్నట్టుండి బుద్దిగా మెగా ఫ్యామిలీకి సారీ చెప్పాడు. నేను చిరంజీవిని, పవన్ కళ్యాణ్, నాగబాబుని  అలాంటి ట్వీట్స్ తో విమర్శించడం కరెక్ట్ కాదని... అసలు చిరులాంటి అన్నయ్య నాకే ఉంటె అతన్ని ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళని చంపేసేవాడినని... ఇంకా నాగబాబు నన్ను కేవలం తిట్టి వదిలేశాడని.... నాగబాబు ని ట్వీట్స్ తో బాధించినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానని ట్వీట్స్ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

అలాగే పవన్కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా క్షమాపణలు చెప్పుకున్నాడు వర్మ. తాను వోడ్కా తాగినప్పుడు మత్తులో అలాంటి ట్వీట్స్ చేశానని అందుకే ఇక వోడ్కా ముట్టనని చెబుతున్నాడు. మరి వర్మకి ఇలా ఇప్పుడిప్పుడే ఇంత  బుద్దేలా వచ్చిందో కానీ ఎంతవరకు మాట మీద నిలబడతాడో చూద్దామని కామెంట్ చేస్తున్నారు వర్మ బాధితులు.

Advertisement
Advertisement

Loading..
Loading..
Loading..
advertisement