Advertisement

అల్లుడు సెంటిమెంట్ తో హిట్స్ కొడతాడా..?

Thu 13th Apr 2017 09:34 PM
bellamkonda srinivas,bellamkonda suresh,director boyapati srinu  అల్లుడు సెంటిమెంట్ తో హిట్స్ కొడతాడా..?
అల్లుడు సెంటిమెంట్ తో హిట్స్ కొడతాడా..?
Advertisement

బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ ఒకప్పుడు బడా నిర్మాత. ఆయనకున్న ఆ పరిచయాలతోనే తన కొడుకు శ్రీనివాస్ ని ఎలాగైనా హీరోగా నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే ఇండస్ట్రీకి పరిచయమైనప్పటి నుండి అంతా స్టార్స్ బ్యాచ్ తోనే సినిమాలు చేపిస్తున్నాడు. మొదటి సినిమాకే వి.వి వినాయక్ ని డైరెక్టర్ గా తెచ్చిన బెల్లంకొండ... హీరోయిన్స్ గా సమంతని తీసుకొచ్చాడు. ఇక ఐటెం సాంగ్స్ కి తమన్నాతో వచ్చిన రెండు చిత్రాలలో డాన్స్ వేయించాడు. రెండో సినిమాని ఏదో తమిళ మూవీ ని రీమేక్ తో సరిపెట్టిన సురేష్...  మళ్లీ మూడో చిత్రం కోసం మరో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుని తీసుకొచ్చాడు. ఇక ఇందులో హీరోయిన్ గా టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న రకుల్ ప్రీత్ ని హీరోయిన్ గా తెచ్చి కొడుకు పక్కన నిలబెట్టాడు. ఇక ఐటెం కి కేథరిన్ ని తీసుకొచ్చాడు.

వీటన్నిటికోసం బెల్లంకొండ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. అయినా ఎక్కడా తగ్గడం లేదు. అందుకే ఇప్పుడు శ్రీనివాస్ నాలుగో చిత్రం కోసం అప్పుడే డైరెక్టర్ ని సెట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. 'సినిమా చూపిస్త మావ, నేను లోకల్‌' చిత్రాలతో వరుసగా బ్లాక్‌బస్టర్స్‌ తో దూసుకుపోతున్న డైరెక్టర్ త్రినాధరావు నక్కినను నాలుగో చిత్ర డైరెక్టర్ గా సెట్ చేశాడని చెబుతున్నారు. బెక్కెం వేణుగోపాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... ఈ చిత్రానికి టైటిల్ గా 'మంత్రిగారి అల్లుడు' అనే పేరు ను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మరి రెండు సినిమాలు హిట్ ఇచ్చిన త్రినాధరావు తన కొడుకుని కూడా డైరెక్ట్ చేసి తన కొడుక్కు హిట్ ఇస్తాడని ఆశతో బెల్లంకొండ సురేష్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక ఇప్పుడు శ్రీనివాస్ , బోయపాటి డైరెక్షన్లో చేసే చిత్ర టైటిల్ కూడా 'అల్లుడు బంగారం' కావడం విశేషం. మరి ఇప్పటివరకు బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు శీను'తో ఒక మాదిరి హిట్టు కొట్టి ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన 'స్పీడున్నోడు' చతికిలపడినా మరలా బోయపాటి డైరెక్షన్ లో వచ్చే 'అల్లుడు బంగారం' కూడా హిట్ అవుతుందనే అనుకుంటున్నాడు. ఇక తదుపరి చిత్రం కూడా 'మంత్రిగారి అల్లుడు' గా తెరకెక్కితే గనక ఈ 'అల్లుడు' సెంటిమెంట్ తో శ్రీనివాస్ హిట్స్ కొడతాడా? లేదా? అనేది మాత్రం కొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement