Advertisementt

బన్నీ అనుకున్నంత చేశాడు..!

Wed 12th Apr 2017 06:14 PM
allu aravind,allu arjun,director harish shankar,dj movie,producer dil raju  బన్నీ అనుకున్నంత చేశాడు..!
బన్నీ అనుకున్నంత చేశాడు..!
Advertisement
Ads by CJ

మాస్టర్‌మైండ్‌ అల్లుఅరవింద్‌ తనయునిగా బన్నీ కూడా అదే తెలివితేటలు పుణికిపుచ్చుకున్నాడు. ఇక ఆ బుర్రకు దిల్‌రాజు తోడయితే ఇక చెప్పేదేముంది. అదే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'డిజె' (దువ్వాడ జగన్నాథం) రిలీజ్‌ విషయంలో బన్నీ నిర్ణయం చూసి అందరూ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రం ఏప్రిల్‌28న విడుదల కానుండటంతో ఈ చిత్రానికి గతంలో కూడా మహేష్‌ సైతం తన 'శ్రీమంతుడు'కి భారీ గ్యాప్‌ ఇచ్చాడు.
కానీ ఈసారి మాత్రం 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రానికి అందరు పెద్ద హీరోలు ఓ నెల గ్యాప్‌ ఇస్తారని భావిస్తున్న సమయంలో బన్నీ-దిల్‌రాజుల 'డిజె'ను తెగించి మరీ మే19న విడుదల చేయడానికి రెడీ అయ్యారనే వార్తలు వచ్చాయి. కానీ చాలామంది మాత్రం ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్న గిమ్మిక్‌ అని, బన్నీ 'డిజె' చిత్రం మే19న విడుదల కాకుండా వాయిదాపడటం గ్యారంటీ అని తేల్చిచెప్పారు. సరిగ్గా ఇదే విషయం జరిగింది. కొన్ని కారణాల వల్ల బన్నీ తమ 'డిజె' చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడట. మొత్తానికి వార్తల్లో ఉండటం ఎలాగో బన్నీ-దిల్‌రాజులు చూపిస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ