వైస్రాయ్‌ ఎవరో బాలయ్యకు బాగా తెలుసు!

Mon 10th Apr 2017 08:26 PM
vaisrai hotel,purandeswari daggubati,balakrishna,vaisrai,purandeswari about balakrishna,ntr  వైస్రాయ్‌ ఎవరో బాలయ్యకు బాగా తెలుసు!
వైస్రాయ్‌ ఎవరో బాలయ్యకు బాగా తెలుసు!

స్వర్గీయ ఎన్టీఆర్‌పై వైస్రాయ్‌ హోటల్‌లో చెప్పులు విసిరిన సంఘటన అందరికీ తెలుసు. కాగా ఈ విషయంలో బిజెని నేత పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైస్రాయ్‌ ఎవరో బాలకృష్ణకు తెలుసని, తన సోదరుడు బాలకృష్ణ తన తండ్రి మీద జీవిత చరిత్రను సినిమాగా తీస్తే అందులో వైస్రాయ్‌ ఘటనను కూడా చూపించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన ప్రతి ఘట్టం బాలయ్యకు తెలుసునన్నారు. ఇక తన తండ్రి ఒంటరితనంతో లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నాడని ఆమె సమర్ధించారు. తాను ఇక పార్టీలు మారనని తెలిపారు. 

ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలపనందు వల్లే తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. చంద్రబాబు శ్రీమతి, తన సోదరి భువనేశ్వరితో తనకు విభేదాలు లేవని, కానీ రాజకీయ నీడలు కుటుంబసంబంధాలపై పడకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయంగా ఆమె చెప్పారు. చంద్రబాబు పాలనకు మార్కులు వేసే స్థాయి తనకు లేదని, ఆయనకు ప్రజలే మార్కులేస్తారని వ్యంగ్యంగా అన్నారు. 

ఇక తాను కొన్ని పరిస్థితుల ప్రభావం వల్లనే రాజకీయాలలోకి రావాల్సివచ్చిందని తెలిపారు. జనసేన అధినేత పవన్‌కళ్యాన్‌పై తాను కామెంట్‌ చేయనని, ఆయనతో పొత్తు విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని అన్నారు... ఇలా ఆమె పలు విషయాలపై తన అభిప్రాయాలను తెలపడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.