Advertisementt

ప్రభాస్ కి రాజమౌళి అంటే అస్సలిష్టం లేదంట!

Mon 10th Apr 2017 08:16 PM
ss rajamouli,prabhas,maniratnam,baapu,prabhs liked director,bahubali 2 audio launch  ప్రభాస్ కి రాజమౌళి అంటే అస్సలిష్టం లేదంట!
ప్రభాస్ కి రాజమౌళి అంటే అస్సలిష్టం లేదంట!
Advertisement
Ads by CJ

ఒక్క బాహుబలి కోసమే దాదాపు ఐదేళ్లు కేటాయించాడు హీరో ప్రభాస్. మధ్యలో వేరే సినిమా చేసుకోమని డైరెక్టర్ రాజమౌళి చెప్పినా వెళ్లకుండా కేవలం బాహుబలి కోసమే తన డేట్స్ ని ఇచ్చేశాడు. మరి ఐదేళ్లు టైమ్ కేటాయించినందుకు ప్రతి ఫలంగా ఒక్క బాహబలి సినిమాతోనే ప్రభాస్ అంటే ప్రపంచం మొత్తం తెలిసేలా చేశాడు రాజమౌళి. ఇప్పుడు బాహుబలి ద కంక్లూజన్ సినిమా ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది. అందుకే బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటే పబ్లిసిటీ కార్యక్రమాలను కూడా పెంచేసింది బాహుబలి టీమ్.

తాజాగా ఆదివారం రాత్రి చెన్నై లో బాహుబలి ఆడియో వేడుకని భారీ లెవల్లో చేశారు. ఈ వేడుకకి రాజమౌళి గురువు గారు కె రాఘవేంద్రరావు తోపాటు బాహుబలి టీమ్ సభ్యులు అందరూ హాజరయ్యారు. ఈ వేడుకలో నటుడు ప్రభాస్ మాట్లాడుతూ తనకి ఇష్టమైన దర్శకుడు రాజమౌళి కాదని చెప్పి అక్కడున్న అందరిని ఆశ్చర్య పరిచాడు. తనకి ఇద్దరు దర్శకులంటే ఇష్టమని... వారెవరో కాదని ఒకరు మణిరత్నం కాగా మరొకరు బాపు అని చెప్పాడు. వాళ్ళిద్దరిలో మరింత ఇష్టమైన దర్శకుడు మణిరత్నం అని ఆయనంటే నాకు పిచ్చి అని చెప్పాడు. ఇక ఈ విషయం రాజమౌళికి కూడా తెలుసునని చెప్పాడు. 

అసలు ఏ మాత్రం మొహమాట పడకుండా చెప్పిన ప్రభాస్ మాటలను అక్కడే వున్న రాజమౌళి చిరునవ్వుతో వింటూ కూర్చున్నాడు. ఎంతైనా ప్రభాస్ గ్రేట్ కదండీ. తన పేరు ప్రపంచం మొత్తం మార్మోగిపోయేలా చేసిన రాజమౌళిని కాదని తనకి ఇష్టమైన దర్శకుడు మణిరత్నం అని తన మనసులోని మాటను చెప్పినందుకు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ