Advertisement

వీడు విశాల్ రా...బుజ్జి....!

Mon 03rd Apr 2017 08:48 PM
vishal,nadigar sangam,new building,hero vishal,rajinikanth,kamal haasan  వీడు విశాల్ రా...బుజ్జి....!
వీడు విశాల్ రా...బుజ్జి....!
Advertisement

పేదకళాకారుల బాధలు అన్నిభాషల్లోనూ ఉన్నాయి. కానీ సోకాల్డ్‌ మూవీ ఆర్టిస్ట్‌ నాయకులుగానీ, నిర్మాతల,దర్శకమండలి, ఫిల్మ్‌చాంబర్‌లతో పాటు వారిని ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెతను తిరగరాస్తూ, ముందుగా రచ్చ గెలిపి, తమిళంలో దూసుకుపోతున్న విశాల్‌ మాత్రం కోలీవుడ్‌లో రోజు రోజుకు ఎదుగుతున్నాడు. నడిగర్‌ సంఘం ఎన్నికల్లో మహామహులను మట్టికరిపించి, చెన్నై వరదల సందర్భంగా తానే స్వయంగా రంగంలోకి దిగి, ఓ పత్రికలో ఓ రైతు పడుతున్న బాధను చూసి చలించి అతని అప్పును విశాలే తీర్చాడు. ఇలా తన మానవత్వాన్ని కూడా చాటుకుంటున్నాడు. కాగా నడిగర్‌ సంఘం కోసం ఓ బిల్డింగ్‌ను నిర్మించే వరకు తాను పెళ్లి చేసుకోనని చెప్పి శపథం చేసి, ఆ బిల్డింగ్‌లోనే తన పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. అనుకున్నట్లుగా ఆ భవనానికి శంకుస్థాపన చేయించాడు. అదీ రజనీ, కమల్‌ల చేతుల మీదుగా చేయించి వివాదాలకు తావులేకుండా తన పెద్దరికం చాటుకున్నాడు. 

ఇక 26కోట్లు చేసే బిల్డింగ్‌ నిధులకోసం ఆమద్య ఓ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించి అనూహ్యంగా 9కోట్లు పోగుచేశాడు. కానీ అవి సరిపోవని తెలిసి కార్తీతో కలిసి తాను కూడా 10కోట్లు విరాళం ఇచ్చాడు. పోనీ కార్తి, విశాల్‌లు ఏమైనా 20,30కోట్లు రెమ్యూనరేషన్స్‌ తీసుకునే స్థాయిహీరోలు కాదు. కానీ వారి ఔదార్యం గొప్పది. పనిలోపనిగా పేద, వృద్ధ కళాకారులకు పెన్షన్‌ను ప్రవేశపెట్టాడు. ఈ భవనం పూర్తయితే ఏడాదికి 50లక్షలు ఆదాయం వస్తుంది. ఆ మొత్తాన్ని పేద, వృద్ద కళాకారుల కోసం ఆయన ప్లాన్‌ చేస్తూ.. వీడు మగాడ్రా బుజ్జి అనిపించుకుంటున్నాడు. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ సంగతేంటి..అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement