Advertisementt

రాజమౌళి, క్రిష్‌లని కిడ్నాప్‌ చేసేస్తారా..?

Mon 03rd Apr 2017 08:33 PM
ss rajamouli,krish,bollywood,kanche,gautamiputra satakarni,baahubali  రాజమౌళి, క్రిష్‌లని కిడ్నాప్‌ చేసేస్తారా..?
రాజమౌళి, క్రిష్‌లని కిడ్నాప్‌ చేసేస్తారా..?
Advertisement
Ads by CJ

ఒకప్పుడు మన తెలుగుకు చెందిన పలువురు దర్శకులు కూడా హిందీల్లో చిత్రాలు చేశారు. కానీ పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయారు. కానీ ప్రస్తుతం రాజమౌళి, క్రిష్‌లు అదే దారిలో నడుస్తున్నారు. 'బాహుబలి - ది కన్‌క్లూజన్‌' చిత్రం తర్వాత రాజమౌళి బాలీవుడ్‌ సినిమా చేయడం ఖాయమైందనే వార్తలు వస్తున్నాయి. రాజమౌళి కూడా బాలీవుడ్‌ మీడియాతో తాను హిందీలో సినిమా చేస్తానని తెలిపాడు. కానీ హీరో ఎవరనేది చెప్పలేదు. కథని బట్టి హీరోను సెలక్ట్‌ చేసుకుంటానని సెలవిచ్చాడు. కాగా రాజమౌళి, సల్మాన్‌ఖ్‌న్‌తో చిత్రం చేయడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. 'భజరంగీ భాయిజాన్‌' చిత్రానికి ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథను అందించాడు. ఈ చిత్రం రికార్డులు క్రియేట్‌ చేసింది. దీంతో రాజమౌళి చిత్రం విజయేంద్రప్రసాద్‌ కథతో సల్మాన్‌ఖాన్‌ హీరోగా రూపొందునుందనే వార్తలు బలపడుతున్నాయి. 

మరోపక్క 'కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి'లతో హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రాలను కూడా అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్‌లో అద్భుతమైన అవుట్‌పుట్‌ ఇచ్చిన క్రిష్‌ ఆ తర్వాత ఎవరితో చిత్రం చేస్తాడా? అనే ఆసక్తిని కలిగించాయి. వెంకీ, రామ్‌చరణ్‌లతో పాటు చిరుకి కూడా స్టోరీ చెప్పాడు. కానీ ఆయన తన తదుపరి చిత్రం బాలీవుడ్‌లోనే చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. క్రిష్‌ కంగనా రనౌత్ ప్రదాన పాత్రలో ఝూన్సీలక్ష్మీభాయ్‌ జీవిత చరిత్రను తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ 'మణికర్ణిక'. ఇది లక్ష్మీభాయ్‌ అసలు పేరు. ఈ చిత్రాన్ని స్వయంగా కంగనా రనౌత్ నిర్మించనుంది. మొదట్లో దర్శకత్వం కూడా తానే చేయాలని భావించింది. కానీ క్రిష్‌ని నమ్మి ఈ ప్రాజెక్ట్‌ని అతని చేతుల్లో పెట్టింది. ఆల్‌రెడీ క్రిష్‌ ఇప్పటికే 'గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌' అనే బాలీవుడ్‌ మూవీ చేసి ఉన్నాడు. 

మరి రాజమౌళి, క్రిష్‌లని అక్కడి స్టార్స్‌ తమ చిత్రాలను చేయమంటే తమ చిత్రాలను చేయాలని వారిని కిడ్నాప్‌ చేసినా ఆశ్చర్యంలేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ