Advertisementt

సూపర్‌స్టార్‌ని అవమానిస్తున్నారు..!

Sat 01st Apr 2017 04:03 PM
super star krishna,jabardasth,roja,naga babu,comedy on krishna  సూపర్‌స్టార్‌ని అవమానిస్తున్నారు..!
సూపర్‌స్టార్‌ని అవమానిస్తున్నారు..!
Advertisement
Ads by CJ

కామెడీ పేరుతో వెకిలి చేష్టలు టీవీ ప్రోగ్రామ్‌ 'జబర్దస్త్‌' ప్రత్యేకత. చాలాకాలంగా సా...గుతున్న ఈ ప్రోగ్రామ్‌కు స్కిట్స్‌కు కొత్త థాట్స్‌ కరువయ్యాయి. దాంతో సినీ, రాజకీయ ప్రముఖులను పేరడీ చేస్తూ అపహాస్యం పండిస్తున్నారు. నవ్వించడానికి చేస్తున్న వెకిలితనం అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. ముఖ్యంగా సూపర్‌స్టార్‌ కృష్ణ పాత సినిమాలను పేరడీ చేస్తున్నారు. కృష్ణ మేనరిజాన్ని వ్యంగ్యంగా చూపిస్తున్నారు. అలాగే ఆయన పాటలకు వేసిన స్టెప్స్‌ను చులకన చేస్తున్నారు. కృష్ణ తన బాడీ లాంగ్వేజ్‌ ప్రకారం నటించారు. ఆయన వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు జరిగింది. అలాంటి లెజెెండ్‌ను అవహేళన చేస్తున్న తీరు అభిమానులు తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.

'జబర్దస్త్‌' ప్రోగ్రామ్‌ కామెడీకి తిలోదకాలిచ్చి డబుల్‌ మీనింగ్‌ స్థానే డైరెక్ట్‌ మీనింగ్‌ వచ్చే సంభాషణలు చేర్చారు. రేటింగ్‌ కాపాడుకోవడం కోసం అడ్డదార్లలో వెళుతున్నారనే విమర్శలున్నాయి. యాంకర్లు అందాలను ప్రదర్శించడానికి పోటీ పడుతున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి చూసే టీవీ ప్రోగ్రామ్‌లో కనీస విలువలు పాటిస్తే బావుంటుంది. జడ్జిల స్థానంలో కూచున్న నాగబాబు, రోజా సైతం వీటిని ఎంకరైజ్‌ చేయడం శోచనీయం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ