Advertisementt

'బాహుబలి' కి ఈ రెండు చిత్రాలు పోటీ..!

Fri 31st Mar 2017 04:05 PM
bahubali 2,keshava,andhagadu,raj tarun,nikhil  'బాహుబలి' కి ఈ రెండు చిత్రాలు పోటీ..!
'బాహుబలి' కి ఈ రెండు చిత్రాలు పోటీ..!
Advertisement
Ads by CJ

'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రం ఏప్రిల్‌ 28న విడుదలవుతుంది. కాగా ఈచిత్రం విడుదలైన కొద్దిగ్యాప్‌లోనే ఇద్దరు యంగ్‌ హీరోలు తమ సినిమాలను రిలీజ్‌ చేసి పోటీకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. కాగా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ యూత్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజ్‌తరుణ్‌కి గత కొంతకాలంగా సరైన హిట్‌ లేదు. 'ఆడోరకం.. ఈడో  రకం', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రాలు జస్ట్‌ యావరేజ్‌ దగ్గరే ఆగిపోయాయి. దాంతో ఆయన గుడ్డివానిగా నటిస్తూ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో వరుసగా చేస్తున్న రెండో చిత్రం 'అంధగాడు'. రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని మే మూడో వారంలో విడుదల చేయనున్నారు. 

ఇక విభిన్న ప్రయోగాత్మక చిత్రాలతో దూసుకుపోతున్న మరో యంగ్‌ హీరో నిఖిల్‌. ఈయనకు ఇటీవలి కాలంలో 'శంకరాభరణం' తప్పితే మరో ఫ్లాప్‌ లేదు. కాగా ఆయన తనకు హీరోగా మంచి విజయాన్ని అందించిన సుదీర్‌వర్మతో ప్రస్తుతం 'కేశవ' అనే మరో విభిన్న చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పోస్టర్స్‌, లుక్స్‌ అన్నీ బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఉగాది సందర్భంగా విడుదలైన ఈ రెండు చిత్రాల పోస్టర్స్‌ మంచి క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు వారం గ్యాప్‌లో వచ్చే అవకాశం ఉంది. మరి 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' ఓవర్‌ఫ్లోని ఏ సినిమా సాధించి, లాభపడుతుందో చూడాలి...! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ