Advertisementt

చిరు 'ఖైదీ..' వేయటానికి భయపడుతున్నారు!

Wed 29th Mar 2017 08:50 PM
chiranjeevi,khaidi no 150,balakrishna,gouthamiputra satakarni,maa tv  చిరు 'ఖైదీ..' వేయటానికి భయపడుతున్నారు!
చిరు 'ఖైదీ..' వేయటానికి భయపడుతున్నారు!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం మంచి విజయం సాధించింది. ఇక ఈ చిత్రం ఉగాది కానుకగా మాటీవీలో ప్రసారం కానుంది. మాటీవీ తో పాటు, మా మూవీస్‌లో కూడా దీనిని ప్రసారం చేయనున్నారు. కాగా ఈ చిత్రం విడుదలైన తర్వాత అతి తక్కువ రోజుల్లోనే టీవీలో ప్రసారం కానుండటంతో బాలయ్య అభిమానులతో పాటు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయిన వారు ఈ ప్రీమియర్‌షో కోసం వేయికళ్లతో చూస్తున్నారు. 

కాగా ఈ చిత్రం విడుదలైన ముందు రోజు రిలీజ్‌ అయిన చిరంజీవి 'ఖైదీ నెంబర్‌150' చిత్రం ఎప్పుడు టీవీలో ప్రసారమవుతుందా? అని మరోపక్క చిరు అభిమానులు వేచిచూస్తున్నారు. కానీ చిరు బుల్లితెరపై కనిపిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పెద్దగా టీఆర్పీలు సాధించలేకపోతుండటంతో 'ఖైదీనెంబర్‌150' చిత్రం టీవీలో ప్రీమియర్‌ షో వేస్తే టీఆర్పీలు ఎలా ఉంటాయి? 

ఈ చిత్రం థియేటర్లలో లాగా బుల్లితెరపై కూడా మంచి విజయం సాధించి, టీఆర్పీలు సాధిస్తుందా? లేక బుల్లితెరపై దీనికి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సెగ తగులుతుందా? అనేవి ఆసక్తికరంగా మారాయనే చెప్పవచ్చు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ