Advertisementt

బాలయ్య హీరోయిన్ పేరు భలే వుంది..!

Mon 27th Mar 2017 10:04 PM
balakrishna,puri jagannadh,muskhan  బాలయ్య హీరోయిన్ పేరు భలే వుంది..!
బాలయ్య హీరోయిన్ పేరు భలే వుంది..!
Advertisement
Ads by CJ

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో బాలకృష్ణ నటించే చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే వారి కాంబినేషన్ లో తెరకెక్కే ఈ చిత్రానికే హైలెట్ అయిన యాక్షన్ సన్నివేశాన్ని చాలా స్పీడ్ గా పూర్తి చేసేసారు. ఇక బాలయ్యబాబు పక్కన ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారనే టాక్ వినబడుతుంది. అయితే ఆ ముగ్గురు హీరోయిన్స్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. కాకపోతే బాలీవుడ్ భామ సన్నీ లియోన్ మాత్రం ఒక స్పెషల్ సాంగ్ లో చిందులు వేయనున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. అలాగే మిగతా ముగ్గురు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ కూడా సెట్ అయ్యిందని.. ఆమె ముంబై మోడల్ అనే ప్రచారం జరిగింది.

కానీ ఆ వివరాలు బయటపెట్టని పూరి ఇప్పుడు ఆమె పేరు ముస్కాన్ అని, బాలయ్య పక్కన ఒక హీరోయిన్ గా ఆమె నటించనుందని కన్ఫర్మ్ చేశాడు. కాకపోతే ముస్కాన్ డిటైల్స్ మాత్రం బయటపెట్టలేదు డైరెక్టర్ పూరి. ఈ హీరోయిన్ తో పాటు బాలకృష్ణ ఈ చిత్రంలో గ్యాంగ్ స్టార్ గా నటిస్తాడని.. 100 శాతం బాలకృష్ణ హీరోయిజాన్ని హైలెట్ చేస్తానని పూరి ప్రామిస్ చేస్తున్నాడు. అలాగే బాలయ్య గత సినిమాల్లో  పొలిటికల్ డైలాగ్స్ ఉన్నట్లు ఇప్పుడు తన సినిమాలో అలాంటి పొలిటికల్ పంచెస్ గాని, డైలాగ్స్ కానీ ఉండవని ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు పూరి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ