Advertisementt

రాజమౌళి ని ఏడిపించేశాడు..!

Mon 27th Mar 2017 05:29 PM
ss rajamouli,keeravani,bahubali pre release event  రాజమౌళి ని ఏడిపించేశాడు..!
రాజమౌళి ని ఏడిపించేశాడు..!
Advertisement
Ads by CJ

బాహుబలి ద కంక్లూజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఆధ్యంతం అందరిని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ కి హాజరైన బాహుబలి సంగీత దర్శకుడు, రాజమౌళికి పెద్ద అన్న అయిన కీరవాణి బాహుబలి ఈవెంట్ స్టేజి మీదకెక్కి బాహుబలి చిత్రం గురించి మాట్లాడుతూ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తుతూ ఒక పాటని రాజమౌళిపై పాడి రాజమౌళితో సహా అక్కడున్న వారందరిని ఎమోషనల్ గా కట్టిపడేసారు. కీరవాణి తన తమ్మునికి దీవెనలు అందిస్తూ.. పాట రూపంలో పొగుడుతుంటే అక్కడే స్టేజి కింద కూర్చుని వున్నరాజమౌళి  పాట వింటూ తీవ్రమైన భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఏడ్చేశాడు . 

తమ్ముడు రాజమౌళి కోసం అన్న కీరవాణి  'ఎవ్వడంటే ఎవ్వడనీ..' అనే 'బాహుబలి' పాటని లిరిక్స్‌ మార్చి పాడి సర్‌ప్రైజ్‌ చేసి మరీ రాజమౌళి చేత కన్నీళ్లు పెట్టించేసాడు. అంతేకాకుండా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో సహా ఆయన కుటుంబసభ్యులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత రాజమౌళిని ఓదార్చి కీరవాణి ఆయన్ని ఆశీర్వదించారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ