Advertisementt

బాలయ్య సరసన ఆ హాట్‌లేడీ నా..?

Sat 25th Mar 2017 12:55 PM
sunny leone,puri jagannadh,balakrishna,item song  బాలయ్య సరసన ఆ హాట్‌లేడీ నా..?
బాలయ్య సరసన ఆ హాట్‌లేడీ నా..?
Advertisement
Ads by CJ

ఎప్పుడైతే పూరీ 'రోగ్‌' చిత్రం వేడుకలో సన్నిలియోన్‌ చిందేసిందో అప్పటి నుంచి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. పూరీ చిత్రాలంటే అందులో ఐటం సాంగ్స్‌ అద్భుతంగా ఉండి సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. ఇక 'పోకిరి'లో ముమైత్‌ఖాన్‌ పాట గురించి చెప్పాల్సిన పనిలేదు. పూరీ దర్శకత్వానికి భాస్కరభట్ల పాట తోడైతే ఆ చిత్రంలో ఐటం అదిరిపోతుంది. కాగా ప్రస్తుతం పూరీ బాలయ్యతో 101వ చిత్రాన్ని జెట్‌ స్పీడ్‌తో తీస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మెయిన్‌ హీరోయిన్‌గా తమన్నా లేదా కాజల్‌ను తీసుకునే ఉద్దేశ్యం ఉందంటున్నారు. మరోపక్క సెకండ్‌ హీరోయిన్‌గా ఓ ముంబై మోడల్‌ను పరిచయం చేయాలని పూరీ భావిస్తున్నాడు. 

ఈమధ్యకాలంలో బాలయ్య చిత్రాలలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' తప్పితే మిగిలిన ఎక్కువ చిత్రాలలో బాలయ్య ఇద్దరు వీలుంటే ముగ్గురితో రొమాన్స్‌ చేయడం సహజంగా మారింది. దీంతో ఈ చిత్రంలో కూడా ఇద్దరు హీరోయిన్స్‌ ఉంటారని కన్‌ఫర్మ్‌గా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన ఓ ఐటం సాంగ్‌లో పూరీ.. సన్నిలియోన్‌ చేత చిందేయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ఇప్పటికే తెలుగులో మంచు మనోజ్‌తో 'కరెంటుతీగ'లో నటించింది. కానీ ఆ చిత్రం సన్నికి ఎలాంటి పేరు తేలేదు. ఇక ప్రస్తుతం తెరకెక్కుతోన్న ప్రవీణ్‌సత్తార్‌-రాజశేఖర్‌ల చిత్రంలో కూడా సన్ని చిందేయనుంది. 

ఆమెకు బాలీవుడ్‌లోలాగా టాలీవుడ్‌లో పేరు రావడానికి ... తనపై ఉన్న పోర్న్‌స్టార్‌ అనే చెడ్డ పేరును పక్కన పెట్టడానికి ఇదో మంచి అవకాశం అవుతుంది. సన్నిలియోన్‌.. బాలయ్య-పూరీల చిత్రంలో కన్‌ఫర్మ్‌ అయితే ఇక ఆమె హవా టాలీవుడ్‌లో కూడా మొదలవుతుందని చెప్పవచ్చు. అయితే ఈచిత్రంలో సన్నిని కేవలం ఐటం పాటకే పరిమితం చేస్తారా? లేక మంచి క్యారెక్టర్‌ కూడా ఇస్తారా? అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ