Advertisement

మహేష్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పై.. ఓ జియో వార్త!

Mon 20th Mar 2017 05:16 PM
mahesh babu,prabhas,bahubali,mukhesh ambani,jio  మహేష్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పై.. ఓ జియో వార్త!
మహేష్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పై.. ఓ జియో వార్త!
Advertisement

గత కొంతకాలంలో జియో సంస్థ మూలంగా ఉచిత డేటా, కాల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. దీంతో దీనిని ఉపయోగించుకొని మన నెటిజన్లు ఈమధ్యకాలంలో తెలుగు సినిమా ట్రైలర్స్‌ను, ఫస్ట్‌లుక్‌లను, సాంగ్స్‌ని రికార్డు స్థాయిలో వీక్షిస్తున్నారు. 'ఖైదీనెంబర్‌150, గౌతమీపుత్ర శాతకర్ణి, డిజె, కాటమరాయుడు, బాహుబలి' వంటి చిత్రాల టీజర్స్‌, సాంగ్స్‌ ట్రైలర్స్‌ని బాగా ఉచిత డేటా సాయంతో రికార్డు స్థాయిలో వీక్షించారు. వీటిని రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలోనే ఎక్కువ మంది వినియోగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ ఉచిత డేటా వంటి వాటి గడువు తీరిపోనుందని, దాంతో మహేష్‌బాబు - మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట అవేటెడ్‌ మూవీ కోసం తమిళ, తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఉచిత డేటా వినియోగంలో ఉన్న సమయంలోనే తమ అభిమాన హీరో నటిస్తున్న చిత్రం ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌, టైటిల్‌ వంటివి విడుదల చేస్తే తమ హీరో చిత్రానికి కూడా భారీ, రికార్డు స్థాయిలో వ్యూస్‌, లైక్స్‌ వస్తాయని, కాబట్టి వాటిని తొందరగా విడుదల చేయాలని మహేష్‌బాబు ఫ్యాన్స్‌ చిత్ర దర్శకుడైన మురుగదాస్‌, నిర్మాతలైన ఠాగూర్‌ మధు, ఎన్వీప్రసాద్‌లపై ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

ఇక 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' ట్రైలర్‌ రికార్డు స్థాయిలో వ్యూస్‌ తెచ్చుకోవడానికి ముఖేష్‌ అంబానీ తన రిలయన్స్‌ జియో ద్వారా పరోక్ష సహకారం అందించాడనే వ్యాఖ్యలు కూడా జోరందుకున్నాయి. వీటితో పాటు పలు స్టార్స్‌ అభిమానులు కూడా మార్చి31లోగానే తమ హీరోలకు చెందిన పాటలు, ఫస్ట్‌లుక్స్‌, ట్రైలర్స్‌ రిలీజ్‌లకు ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా ఈ ఉచిత డేటాలకు కాలం చెల్లినా కూడా భవిష్యత్తులో కూడా ఇంటర్నెట్‌ వాడకం చవక కానుందని, కాబట్టి భయపడాల్సిన పనిలేదని మరికొందరు సూచిస్తున్నారు. మొత్తానికి జియోకు మహేష్‌కు లింక్‌ పెట్టిన వారి మేథస్సుకు వంగి వంగి సలాంలు చేయాల్సిందే....! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement