Advertisementt

తెలుగమ్మాయిలకి అక్కడ భలే గిరాకీ..!

Sun 19th Mar 2017 03:47 PM
vikram,vikram dhruva nakshatram,reetu varma,aishwarya rajesh  తెలుగమ్మాయిలకి అక్కడ భలే గిరాకీ..!
తెలుగమ్మాయిలకి అక్కడ భలే గిరాకీ..!
Advertisement
Ads by CJ

తెలుగమ్మాయిలుకి ఇక్కడ టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రావు. కానీ పక్కన తమిళంలో మాత్రం మంచి ఆఫర్స్ తో కోలీవుడ్ లో దూసుకుపోతున్నారు. కానీ ఇక్కడ టాలీవుడ్ లో మాత్రం వారికీ సరైన గుర్తింపు రావడం లేదు. మొన్నామధ్యన 'పెళ్లి చూపులు' సినిమాతో హిట్ కొట్టిన రీతూ వర్మకి ఆ సినిమా తర్వాత అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయని భావించారు. అయితే ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెద్దగా రాలేదు. కాకపోతే తమిళంలో గౌతమ్ మీనన్ - విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కే 'ధృవ నక్షత్తిరమ్' చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. కేవలం ఆమెకు ఆ ఛాన్స్ 'పెళ్లి చూపులు' చిత్రం వలనే వచ్చిందనేది సత్యం. 

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో స్పై ఏజెంట్‌గా డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నాడు విక్రమ్. అసలు ముందుగా 'ధృవ నక్షత్తిరమ్' సినిమాకి విక్రమ్ కి జోడిగా అను ఇమాన్యువల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమెకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ ఛాన్స్ రీతూ వర్మకి తగిలింది. అలాగే ఇప్పుడు మరో తెలుగమ్మాయికి విక్రమ్ 'ధృవ నక్షత్తిరమ్' లో ఛాన్స్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్‌ను ఈ సినిమాకి మరో హీరోయిన్ గా ఎంపిక  చేశారని తెలుస్తుంది. ఈ ఐశ్వర్య రాజేష్‌ను తెలుగు కమెడియన్ శ్రీలక్ష్మి కి స్వయానా మేనకోడలు..... తెలుగు నటుడు రాజేష్ కి కూతురు. 

మరి తెలుగమ్మాయిలు ఇలా తమిళం లో దూసుకుపోతూ తెలుగులో మాత్రం స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ లకు వీరు దూరమైపోతున్నారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు ఇద్దరు విక్రమ్ పక్కన జోడీలుగా నటించే 'ధృవ నక్షత్తిరమ్' సినిమా గనక హిట్ అయితే అక్కడ వీరిద్దరూ సెటిల్ అయ్యే అవకాశాలు పుష్కలం గా వున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ