విక్టరీ వెంకటేష్‌ది ఓ విభిన్నశైలి. ఎంతో సింపుల్‌గా, ఆధ్యాత్మికంగా మాట్లాడే నైజం. ఇక హీరోగా ఆయన కెరీర్ విషయానికి వస్తే ఇప్పటికే 70కిపైగా చిత్రాలలో నటించిన ఆయన అటు క్లాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పిస్తూనే మరోపక్క మాస్ ఇమేజ్ కూడా మెయిన్‌టెయిన్ చేయడం ఆయనకే సాధ్యమైంది. అన్నిరకాల చిత్రాలు చేస్తూ, ఓ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా ఉండటం ఆయనకే చెల్లింది. ఇక ఆయనకు రీమేక్స్ స్పెషలిస్ట్‌గా కూడా పేరుంది. అదే సమయంలో వినూత్న పాత్రలను చేయడంలో కూడా ఆయన ముందుంటారు. శోభన్‌బాబు తర్వాత మహిళల్లో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకు ఎంతో పేరుంది. ఇక సినిమా హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఏడాదికి కనీసం రెండు చిత్రాలైనా విడుదలయ్యేలా ఆయన ప్లాన్ చేసుకుంటారు. కానీ గతకొంత కాలంగా ఆయన స్తబ్దుగా ఉన్నారు. ఆయన నటించిన 'సాలాఖద్దూస్' రీమేక్ 'గురు'ని వాస్తవానికి డిసెంబర్ ఆఖరులో గానీ, లేదా జనవరి26న గానీ విడుదల చేయాలనుకున్నారు. ఈ చిత్రం పూర్తయి కూడా చాలా కాలం అయింది. ఇదో సెమీ రీమేక్ మూవీ అనే టాక్ నడుస్తోంది. చివరకు ఈ చిత్రం ఏకంగా ఏప్రిల్‌కు షిఫ్ట్ అయింది. ఏప్రిల్7న దీనిని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఆయన నటించే తదుపరి చిత్రంపై మాత్రం ఇప్పటికీ సరైనా క్లారిటీ లేదు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడాళ్లు.. మీకు జోహార్లు' చిత్రం అకారణంగా ఆగిపోయింది. ఇక ఆమధ్య మారుతితో 'రాధ' చిత్రం పరిస్థితి కూడా అదే.
ఇక పూరీజగన్నాథ్ కూడా వెంకీకి ఓ సబ్జెక్ట్ చెప్పడం...దానికి వెంకీ కూడా ఓకే చెప్పాడని వార్తలు షికారు చేశాయి. కానీ ఈ చిత్రం బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో ఆయన సోదరుడు సురేష్‌బాబు ఈ చిత్రం విషయంలో వెనుకంజ వేశాడని... చివరకు ఆ చిత్రాన్ని ఎంత బడ్జెట్ అయినా సరే తానే స్వంతగా కూడా ప్రొడ్యూస్ చేయాలని వెంకీ భావించినట్లు కూడా వార్తలు షికారు చేశాయి. కానీ ఆ చిత్రం కూడా ఆగిపోయింది. ఇక క్రిష్‌తో చేయాలనుకున్న సబ్జెక్ట్ కూడా నవలా హక్కుల కారణంగా రద్దయింది. ప్రస్తుతం కిషోర్‌తిరుమల హీరో రామ్‌తో, పూరీ జగన్నాథ్ బాలకృష్ణతో సినిమాలు కమిట్ అయ్యారు. క్రిష్ త్వరలో 'చోర' అనే చిత్రంతో బిజీ కానున్నాడు. మరి ఈ చిత్రం క్రిష్ నిర్మాతగా ఉంటుందా? లేక ఆయన దర్శకత్వంలో ఉంటుందా? అనేది ఇంకా తేలలేదు. దాదాపు సీనియర్ దర్శకులు, కాస్త పేరున్న యువ దర్శకులు అందరూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. దీంతో వెంకీ తదుపరి చిత్రం ఎవరితో? ఎప్పుడు? అనే క్లారిటీ మాత్రం రావడం లేదు. ఇది ఆయన ఫ్యాన్స్‌కు కాస్త నిరుత్సాహాన్ని కలిగిస్తోంది.