'కాటమరాయుడు' కి పాజిటివ్ సెన్సార్..!

పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' చిత్రం మొదలు పెట్టినప్పటినుండి ఆ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ తో పాటే పాజిటివ్ కామెంట్స్ కూడా మీడియాలో విస్తృతం గా ప్రచారం జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతర హీరోలకంటే చాలా ఎక్కువ. ఆయన సినిమాలు హిట్స్ తో ప్లాప్స్ తో సంబంధం లేకుండా కలక్షన్స్ వర్షం కురిపిస్తాయి. ఇక 'కాటమరాయుడు' చిత్రం తమిళ 'వీరం' కి రీమేక్ అని, ఆ సినిమా తమిళంలో ఆశించినంత విజయం సాధించలేదని అలాంటి సినిమాతో పవన్ కళ్యణ్ ఏం హిట్ కొడతాడని కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు ఆ తమిళ రీమేక్ ని సేమ్ టు సేమ్ దించడంలేదని 'గబ్బర్ సింగ్' చిత్రం వలే చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చెబుతున్నారు.

అవన్నీ ఎలాగున్నా పవన్ కాటమరాయుడికి  మాత్రం అనుకున్న క్రేజ్ కంటే ఎక్కువే వచ్చేసింది. 'కాటమరాయుడు' ఫస్ట్ లుక్ తో పాటే ఫస్ట్ టీజర్ కూడా దుమ్ముదులిపేసింది. యూట్యూబ్ లో 'కాటమరాయుడు' రికార్డ్స్ కి ఇక ఎదురు లేకుండా దూసుకుపోతుంది. ఈ చిత్రం ఈ నెల 24 న రిలీజ్ కి సిద్ధమవుతుండగా అప్పుడే సెన్సార్ కార్యక్రమాలకు కూడా పూర్తి చేసుకుంది.  'కాటమరాయుడు' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని.... సెన్సార్ నుండి క్లీన్  యు సర్టిఫికెట్ తెచ్చుకుంది. డైరెక్టర్ డాలి, నిర్మాత శరత్ మరార్ లు సెన్సార్ రిపోర్ట్ తో చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 24 న సినిమా విడుదలవుతుండగా అమెరికాలో ఒకరోజు ముందే అంటే మార్చి 23 నే ప్రీమియర్ షోస్ కి 'కాటమరాయుడు' సిద్ధమైంది. మరి ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ప్రదర్శించని స్థాయిలో.. 'కాటమరాయుడు' ప్రీమియర్స్ షోస్ ని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. 

katamarayudu
positive censor
katamarayudu censor talk
pawan kalyan