Advertisementt

దీనికి మాత్రం మహేష్ కి త్రివిక్రమే కావాలి!

Wed 15th Mar 2017 09:50 PM
mahesh and trivikram lloyd ad shoot,mahesh babu,trivikram srinivas  దీనికి మాత్రం మహేష్ కి త్రివిక్రమే కావాలి!
దీనికి మాత్రం మహేష్ కి త్రివిక్రమే కావాలి!
Advertisement
Ads by CJ

'అతడు, ఖలేజా' వంటి సినిమాల్తో మహేష్ - త్రివిక్రమ్ కు మధ్యన  బంధం బాగా బలపడింది. తర్వాత వారిద్దరి కాంబినేషన్ లో సినిమాలైతే తెరకెక్కలేదుగాని మహేష్ చేసే చాలా యాడ్స్ ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేసాడు. ఇప్పుడు తాజాగా మహేష్.. మురుగదాస్ డైరెక్షన్ లో బైలింగ్యువల్ మూవీలో నటిస్తున్నాడు. మురుగదాస్ చిత్రంలో బిజీగా వున్న మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక యాడ్ షూట్ లో నటించబోతున్నాడట. ఇప్పటికే సినిమాలకన్నా ఎక్కువగా మహేష్ యాడ్స్ లోనే నటిస్తూ బాగా సంపాదిస్తున్నాడనే టాక్ ఉండనే వుంది. తనకి నచ్చిన యాడ్స్ ని చేస్తూ చేతినిండా సంపాదించే మహేష్ టాలీవుడ్ నెంబర్ 1  పొజిషన్ లో కొనసాగుతున్నాడు. 

ఇక ఇప్పుడు లాయిడ్ బ్రాండ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పుకున్న మహేష్.. ఇప్పుడు దానికి సంబందించిన ఒక యాడ్ షూట్ లో పాల్గొనడానికి మురుగదాస్ తో చేసే చిత్రానికి షార్ట్ బ్రేక్ ఇచ్చాడు. లాయిడ్ బ్రాండ్ యాడ్ ని త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయడానికి రెడీ అయిన మహేష్ ఇప్పటివరకు త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమాలకంటే యాడ్స్ లోనే ఎక్కువ నటించాడు. ఇక ఇప్పుడు కూడా మహేష్ తన యాడ్ కోసం త్రివిక్రమ్ నే సెలెక్ట్ చేసుకున్నాడు. మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కే యాడ్ అతిత్వరలోనే బుల్లితెర మీద సందడి చేయనుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ