Advertisementt

బాలయ్యా.. నువ్వెప్పుడయ్యా..!

Wed 15th Mar 2017 04:47 PM
balakrishna,song singing,tollywood top stars,chiru,venki,nag  బాలయ్యా.. నువ్వెప్పుడయ్యా..!
బాలయ్యా.. నువ్వెప్పుడయ్యా..!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు సినిమాలలో నటించే వారికి పాటలు కూడా వారే పాడుకునే గాత్రం ఉండేది. ప్లేబ్యాక్‌ సింగర్స్‌లేని రోజుల్లో అది కంపల్సరీగా మారింది. కానీ ఆ తర్వాత ఆ అంశం మరుగున పడింది. కానీ నేడు మరలా మన స్టార్స్‌ తమ సొంత గొంతుతో పాటలు పాడుతూ తమ ప్రజ్ఞను చాటుకుంటున్నారు. పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, రవితేజ.. ఇలా అందరూ సింగర్స్‌ అవతారం ఎత్తుతున్నారు. ఇక మన సీనియర్‌ స్టార్స్‌ అయిన చిరంజీవి విషయానికి వస్తే ఆయన 'మాస్టర్, మృగరాజు' చిత్రాలలో పాటలు పాడాడు. ఇటీవల కింగ్‌ నాగార్జున సైతం 'నిర్మలా కాన్వెంట్‌' చిత్రం కోసం ఓ పాటను స్వయంగా ఆలపించి అలరించాడు. త్వరలో విడుదలకు ముస్తాబవుతున్న 'గురు' చిత్రం కోసం విక్టరీ వెంకటేష్‌ సైతం గొంతెత్తుకున్నాడు. ఇక మిగిలింది బసవతారకరామపుత్ర బాలకృష్ణ మాత్రమే. కాగా గతంలో బాలయ్య ఒకటి రెండు సార్లు వేడుకల్లో మైక్‌ తీసుకొని తన గానం వినిపించాడు. కానీ సినిమాలలో మాత్రం బాలయ్య పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌కే పరిమితమవుతున్నాడు. మరి ఆయన కూడా ఏదో ఒక చిత్రంలో తాను ఓ పాట పాడితే నందమూరి అభిమానులకు ఆనందం రెండింతలవుతుందని చెప్పవచ్చు. మరి ఆ అదృష్ట ఘట్టం ఎప్పుడు నెరవేరుతుందా? అని చాలా మంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరి వారి కోరికను నందమూరి నటసింహం నెరవేరుస్తాడా? లేదా? అనేది వేచి చూడాల్సివుంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ