Advertisementt


ఇదేం టైటిల్..అఖిల్‌..?

Tue 14th Mar 2017 09:07 PM
akhil,junnu,hellow guru premakosame roy,akhil second movie  ఇదేం టైటిల్..అఖిల్‌..?
ఇదేం టైటిల్..అఖిల్‌..?
Advertisement
Ads by CJ

అక్కినేని నటవారసునిగా మొదటి చిత్రం విడుదల కాకముందే అందరి దృష్టిని ఆకర్షించిన సిసింద్రీ అక్కినేని అఖిల్‌. కాగా ఆయన హీరోగా నటించిన మొదటి చిత్రం 'అఖిల్‌' పెద్ద ఫ్లాప్‌ అయింది. తెలుగులో వచ్చిన అతి పెద్ద డిజాస్టర్స్‌తో ఈ చిత్రానికి కూడా చోటు దక్కుతుంది. అవసరానికి మించి ఖర్చుపెట్టడంతో పెద్దనష్టాలను ఈ చిత్రం తెచ్చిపెట్టింది. కాగా ఆతర్వాత అఖిల్‌కి చిన్న వయసులోనే శ్రేయభూపాల్‌తో నిశ్చితార్ధం జరిగింది. అది పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్‌ అయింది. దాంతో నాగ్‌తోపాటు అఖిల్‌ కూడా బాగా డిస్ట్రర్బ్‌ అయ్యాడు. ఇక ఎక్కువ కాలం ఆలోచిస్తూ గడపడం కన్నా తన రెండో ప్రాజెక్ట్‌ను వీలున్నంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని హీరో అఖిల్‌తో పాటు నిర్మాత నాగార్జున కూడా భావిస్తున్నాడు. అన్ని కుదిరితే ఏప్రిల్‌ మొదటి వారంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లేతో సహా విక్రమ్‌ కె.కుమార్‌ పూర్తి చేశాడు. హీరోయిన్‌గా ఆల్‌రెడీ మేఘా ఆకాష్‌ ఫైనలైంది. మొత్తానికి విక్రమ్‌కె.కుమార్‌ మీద ఉన్న నమ్మకంతో మరీ ఓవర్‌గా కాకపోయిన, సినిమా అనుకున్న స్థాయిలో ఉండటానికి నాగ్‌ సైతం భారీ బడ్జెట్‌కు సిద్దం అవుతున్నాడు. ఇందుకోసం విదేశీ ఫైట్‌ మాస్టర్స్‌ని కూడా తేవడానికి రెడీ అయ్యాడు. ఇక ఈ చిత్రానికి రెండు టైటిల్స్‌ ప్రచారంలోకి వచ్చాయి. ఒకటి 'జున్ను' కాగా రెండోది నాగార్జున-అమలల మధ్య 'నిర్ణయం' చిత్రంలో వచ్చే 'హలో గురూ ప్రేమకోసమేరోయ్‌' అనేది మరోటి. ఈ రెండు చిత్రాల టైటిల్స్‌ను రిజిష్టర్‌ చేయించే పనిలో ఉన్నారు. 'హలో గురు....' టైటిల్‌ను ఇప్పటికే రిజిష్టర్‌ చేయగా, 'జున్ను' టైటిల్‌కు నాగ్‌ నిర్ణయం కోసం వెయిట్‌ చేస్తున్నారని సమాచారం. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ