Advertisementt

మరో నటి కూడా టాలీవుడ్ పై విమర్శలు..!

Mon 13th Mar 2017 10:29 PM
tollywood,kasturi,kasturi comments on telugu hero,kasturi comments on tollywood  మరో నటి కూడా టాలీవుడ్ పై విమర్శలు..!
మరో నటి కూడా టాలీవుడ్ పై విమర్శలు..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సినిమాలు ఒక రేంజ్ లో  కలెక్షన్స్ కురిపిస్తూ బాలీవుడ్ సినిమాల కు ధీటుగా జవాబు చెబుతున్నాయి. ఒక పక్క తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచపటంలో నిలిపే సినిమాలు తీస్తూ... టాలీవుడ్ సినిమాకి పేరు ప్రతిష్టలు తెచ్చే 'బాహుబలి' వంటి సినిమాలు తెరకెక్కుతున్న ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్స్ పై లైంగిక వేధింపులు గురించి కూడా అదే విధంగా అంతటి ప్రచారము జరుగుతున్నాయి. కేవలం ఇలాంటి కథనాలు ఒక్క టాలీవుడ్ లోనే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అప్పుడెప్పుడో తెలుగులో తనకి ఒక హీరో నుండి వేధింపులు ఎదురయ్యాయని రాధికా ఆప్టే ధైర్యం గా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకుంది. ఇలియానా, తాప్సి పన్ను, శృతి వంటి తారలు కూడా తెలుగు సినిమాల్లో నటించాలంటే ఇక్కడి ప్రముఖుల లైంగిక వాంఛలు తీర్చాలని బహిరంగంగా గొంతెత్తి చెబుతున్నారు. ఏకంగా చిన్న హీరోయిన్ మాధవి లత అయితే తాను నోరు విప్పితే కాపురాలు కూలతాయనే హెచ్చరికలు జారీచేస్తుంది. 

ఇక ఇప్పుడు ఓ సీనియర్ నటి కూడా తనని తెలుగు హీరో ఒకరు వేధించారని చెబుతుంది. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో బిజీ అయిన హీరోయిన్ కస్తూరి ఇప్పుడు ఇలా టాలీవుడ్ సీనియర్ హీరో ఒకరిపై లైంగిక ఆరోపణలు చేస్తుంది. కస్తూరి సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుని అమెరికాకి షిఫ్ట్ అయ్యింది. ఈ మధ్యనే వ్యక్తిగత కారణాలతో చెన్నై వచ్చిన కస్తూరి ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనని అప్పట్లో ఒక తెలుగు హీరో చాలా దారుణంగా వేధించాడని... తనని అతని పడక గదికి రప్పించుకోవడానికి చాలా ప్లాన్ చేసి తనపై వత్తిడి తెచ్చాడని... తాను లొంగకపోయేసరికి తనని చాలా ఇబ్బందులు పాలుచేశాడని చెప్పింది. అంతేకాకుండా తనకి సినిమా అవకాశాలు రాకుండా ఆ హీరో అడ్డుకున్నాడని చెప్పింది. అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం బయట పెట్టలేదుగాని అతనిప్పుడు రాజకీయాల్లో ఉన్నాడని... తాను కేవలం ఒకే ఒక చిత్రంలో అతనితో కలిసి నటించానని చెబుతుంది. మరి టాలీవుడ్ పై ఇంతమంది హీరోయిన్స్ ఇలా ధైర్యంగా నోరు విప్పి లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతుంటే నిజంగానే టాలీవుడ్ లో ఇలాంటి వారున్నారనే అనుమానం మాత్రం దృఢంగా బలపడుతుంది. కానీ ఈ వ్యాఖ్యలపైన ఇంతవరకు టాలీవుడ్ పెద్దలెవరు నోరు విప్పి స్పందించడంలేదు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ