Advertisementt

మూడో ఎన్టీఆర్ కి హీరోయిన్ లేదంట..!

Sat 11th Mar 2017 10:38 PM
jr ntr,bobby,nivitha thomas,rashi khanna  మూడో ఎన్టీఆర్ కి హీరోయిన్ లేదంట..!
మూడో ఎన్టీఆర్ కి హీరోయిన్ లేదంట..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ హీరోగా... కళ్యాణ్ రామ్ నిర్మాతగా.. బాబీ డైరెక్షన్ లో ఒక చిత్రం ఈ మధ్యనే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ నెల 15  నుండి ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం. ఇక జై లవ కుశ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తాడని మొదటినుండి చెబుతున్నారు. ఇక ఆ పాత్రల కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.

అయితే ఎన్టీఆర్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అయినప్పటికీ ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్స్ ఫైనల్ అవ్వలేదు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా రాశి ఖన్నాని ఎంపిక చేసిన కళ్యాణ్ రామ్ మరో హీరోయిన్ నివేత థామస్ ని కూడా ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ మూడో పాత్రకి కూడా హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారో అని చూస్తున్న వారికీ చిత్ర యూనిట్ షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ మూడో పాత్రకి అసలు హీరోయిన్ ఉండదని అంటున్నారు. అయితే హీరోయిన్ కి ఫుల్ లెంత్ పాత్ర లేకపోయినా ఒక గెస్ట్ రోల్ మాత్రం ఉంటుందని... ఆ గెస్ట్ రోల్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ని తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. మరి ఎన్టీఆర్ ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లే లీడ్ హీరోయిన్స్ అన్నమాట.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ