Advertisementt

టాలీవుడ్ పై మరో భామ ఆ టైపు వ్యాఖ్యలు..!

Sat 11th Mar 2017 01:16 PM
shruti hariharan,tollywood  టాలీవుడ్ పై మరో భామ ఆ టైపు వ్యాఖ్యలు..!
టాలీవుడ్ పై మరో భామ ఆ టైపు వ్యాఖ్యలు..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ఇండస్ట్రీపై హీరోయిన్స్ సంచలన వ్యాఖ్యలు పరంపర కొనసాగుతూనే వుంది. మొన్నటికి మొన్న రాధికా ఆప్టే తెలుగు సినిమా పై చేసిన వ్యాఖ్యలు మరవకముందే నిన్న తాప్సి పన్ను కూడా టాలీవుడ్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఇక ఈ రోజు కన్నడ హీరోయిన్ శ్రుతి హరిహరన్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘లూసీ’ సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న శ్రుతి కి టాలీవుడ్ అంటే కాళ్ళు చేతులు ఒణికిపోతాయట. తెలుగులో నటించాలి అంటే ఖచ్చితంగా ఆత్మాభిమానం చంపుకోవాలని చెబుతోంది శృతి.

తాజాగా ఆమె ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ లో ఛాన్స్ లు దక్కించుకుంటూ నిలబడాలంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్  లైంగిక వాంఛలు తీర్చాలని లేకపోతె కనీసం సోదిలోకి లేకుండా పోతారని... సంచలనం గా మాట్లాడింది. అసలు తాను పేరు ప్రతిష్టల కోసం సినిమా ఇండస్ట్రీలోకి రాలేదని.... తెలుగు ఇండస్ట్రీకి తమిళ ఇండస్ట్రీకి వీలైనంత దూరం గా ఉండడానికి కారణం అదే అని చెబుతుంది. ఇక తెలుగులో సినిమాలు చెయ్యాలంటే సినీ ప్రముఖల వాంఛలు ఖచ్చితంగా తీర్చాలని అందుకే తెలుగులో చెయ్యడానికి తాను సిద్ధంగా లేనని చెబుతుంది. 

మరి ఇంతమంది తారలు టాలీవుడ్ ఇండస్ట్రీపై దుమ్మెత్తిపోస్తుంటే ఈ వ్యాఖ్యలు నిజమనిపించక మానవు. అసలు నిజంగానే టాలీవుడ్ పెద్దలు ఇలాంటివి చేసే హీరోయిన్స్ కి అవకాశాలు ఇస్తున్నారా? అనే ప్రశ్నలు కోకోల్లలుగా పుట్టుకొస్తున్నాయి. అసలు నిజంగా టాలీవుడ్ సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకోవాలంటే ఇలా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు వినాల్సిందేనా? అసలు ఇప్పటివరకు హీరోయిన్స్ గా ఒక వెలుగుతున్న హీరోయిన్స్ ఇలానేనా? అనే డౌట్స్  రైజ్ చేస్తున్నారు జనాలు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ