Advertisementt

తమన్నా కి ఆ యావ మాత్రం తగ్గలే..!

Thu 09th Mar 2017 08:43 PM
tamanna,tamanna bollywood interest,chore nikhale ka bhaga  తమన్నా కి ఆ యావ మాత్రం తగ్గలే..!
తమన్నా కి ఆ యావ మాత్రం తగ్గలే..!
Advertisement
Ads by CJ

తమన్నాకి 'బాహుబలి' పుణ్యమా అని ఇప్పుడు ఆమె పేరు ఇండియాలో మార్మోగిపోతోంది. రాజమౌళి తీసిన 'బాహుబలి పార్ట్ 1' లో ఆమె నటించింది. ఇక ఆ చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచపటంలో నిలిచేలా చేసింది. అందులో నటించిన స్టార్స్ అంత గుర్తింపు పొందారు. అయితే తమన్నా మాత్రం 'బాహుబలి' చిత్రంలో నటించకముందే ఆమె బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన 'హిమ్మత్ వాలా' రీసెంట్ గా 'తుటక్ తుటక్ తుటియా' చిత్రాలు ఆమెను బాలీవుడ్ లో నిలబెట్టలేకపోయాయి. ఆ చిత్రాలు అనుకున్నంత సక్సెస్ సాధించకపోయేసరికి అమ్మడు మళ్ళీ సౌత్ కి వచ్చేసి ఇక్కడ తన హవా కొనసాగిస్తూనే వుంది. మళ్ళీ 'బాహుబలి' పుణ్యమా అని ఇప్పుడు బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతుందట తమన్నా.

అమర్ కౌశిక్ డైరెక్షన్ లో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించనున్న ‘చోర్ నికల్ కే భాగ’ సినిమాలో తమన్నా నటించబోతుందని సమాచారం. అయితే ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ కాదట.... ఒక కీలక పాత్రలో ఎయిర్ హోస్టెస్ గా నటిస్తుందని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని జేఏ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి జాన్ అబ్రహం నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రంతోనైనా తమన్నా బాలీవుడ్ లో హిట్ అందుకుని అవకాశాలు చేజిక్కించుకుంటుందో? లేకపోతె మళ్ళీ గత చిత్రాల వలే ప్లాప్ చవిచూసి సౌత్ ని వెతుక్కుంటూ వస్తుందో? అనేది తెలియాలంటే ‘చోర్ నికల్ కే భాగ’ విడుదల వరకు వెయిట్ చెయ్యాల్సిందే. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ