Advertisementt

రకుల్, కీర్తి సురేష్ లకు పోటీకొస్తుంది..!

Fri 03rd Mar 2017 10:41 PM
rakul preet singh,keerthi suresh,mehrene kaur pirzada  రకుల్, కీర్తి సురేష్ లకు పోటీకొస్తుంది..!
రకుల్, కీర్తి సురేష్ లకు పోటీకొస్తుంది..!
Advertisement
Ads by CJ

సుమారు దశాబ్దకాలం పాటు సమంత, కాజల్ అగర్వాల్,అనుష్క వంటివారు టాలీవుడ్ ని ఏలారు. వీరు టాప్ లో కొనసాగుతూ చిన్న చితక హీరోయిన్స్ కి చుక్కలు చూపెట్టేవారు. అయితే వీరి హవా గత ఏడాది నుండి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ గ్యాప్లో రకుల్ ప్రీత్ సింగ్ ప్రతి ఒక్క హీరోకి ఒకే ఒక్క అప్షన్ గా దూసుకుపోతుంది. గత రెండెళ్లుగా రకుల్ దాదాపు అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఉంది. ఇక ఈ మధ్య కాలంలో 'నేను శైలజ' ఫేమ్ కీర్తి కూడా హీరోలకు బెస్ట్ అప్షన్ గా మారిపోయి లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక వీరిద్దరూ ఇప్పుడు స్టార్ హీరోలతో నటిస్తూ గట్టిగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే వీరి రెమ్యునరేషన్ తట్టుకోవాలంటే చిన్న నిర్మాతలకు ధైర్యం చాలడం లేదు. 

ఇక ఇప్పుడు అనూహ్యం గా నాని హీరోయిన్ మెహరీన్  లైన్ లోకి వచ్చి చిన్న సినిమాల నిర్మాతలకు అందుబాటులోకి వచ్చేసింది. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' తో ఇండస్ట్రీకి పరిచయమైనా... చాలా గ్యాప్ తర్వాత మెహరీన్ ఇప్పుడు రెండు మూడు సినిమాలలో అవకాశాలు దక్కించుకుని బిజీ అయ్యింది. ఇప్పటికే రవితేజ పక్కన ఛాన్స్  కొట్టేసిన మెహరీన్ మరో రెండు సినిమాల్లో అవకాశాలు కొట్టేసిందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా ఆమె టాలీవుడ్ లో దూసుకుపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మెహరీన్ తో రకుల్ కు కీర్తి సురేష్ కి నిర్మాతలు చెక్ పెట్టేస్తారనే టాక్ మొదలైపోయింది. 

చూద్దాం మెహరీన్ ఫేట్ ఎలా ఉందో..... మరి రకుల్ ప్రీత్ సింగ్ కి కీర్తి సురేష్ కి చెక్ పెడుతుందో లేకపోతె కొంతమంది హీరోయిన్స్ వలే రెండు మూడు చిత్రాలకే తిరుగు ప్రయాణమవుందో చూద్దాం అంటున్నారు టాలీవుడ్ జనాలు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ