Advertisementt

భావన కమిట్మెంట్ కి హ్యాట్సాఫ్..!

Wed 01st Mar 2017 09:16 PM
bhavana,malayalam actress bhavana  భావన కమిట్మెంట్ కి హ్యాట్సాఫ్..!
భావన కమిట్మెంట్ కి హ్యాట్సాఫ్..!
Advertisement
Ads by CJ

మలయాళ నటి భావన మీద దాడి జరిగి దాదాపు 15  రోజులు కావొస్తుంది. ఆ దాడిలో భావన ని  ఫోటోలు తీసిన దుండగులు ఆమెను నానారకాల ఇబ్బందులకు గురిచేశారు. ఇక దుండగులు కు మలయాళ సినిమా పరిశ్రమ పెద్దలతో లింకులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఇప్పటివరకు కొంతమంది నిందితులని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు . అయితే భావన పై  దాడి చేసిన వారికి శిక్ష పడాలని మలయాళ పరిశ్రమతోపాటే మిగతా సినిమా పరిశ్రమల వాళ్ళు కూడా భావన కి సపోర్ట్ చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులు భావన ఎవరికీ కనబడలేదు.... సరికదా అసలు ఎవరికీ కనబడకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత భావన తన షూటింగ్ లో యదావిధిగా పాల్గొంటుంది. భావన అన్ని విషయాలు మర్చిపోయి ఇలా షూటింగ్స్ లో పాల్గొనడం చూసిన వారంతా భావన గ్రేట్ అని కొనియాడుతున్నారు.

ఇక భావన తాజాగా తనపై జరిగిన లైంగిక దాడి గురించి సోషల్ మీడియాలో స్పందించింది. ఇక భావన.... 'నేను జీవితంలో చాలాసార్లు కింద పడ్డాను. కానీ మళ్ళీ అన్ని తట్టుకుని పైకి లేచాను. నేను జీవితంలో ఎప్పుడు చూడనిది, విననిది నా జీవితంలో జరిగింది. చాలా బాధపడ్డాను, ఆ బాధలు ఓర్చుకుని నేను మళ్ళీ నిలబడి మీ ముందుకు వచ్చాను. ఎప్పుడు కిందపడినా.. లేచి నిలబడగలను' అంటూ పోస్ట్ చేసింది. ఇక భావన చేసిన ఈ పోస్ట్ ను ఆమె సహా నటుడు పృద్వి రాజ్ షేర్ చేసాడు. మిగతా స్టార్స్ కూడా ఆమె చేసిన పోస్ట్ ని షేర్ చేస్తూ భావనకు అండగా నిలుస్తున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ