Advertisementt

పూరి... పబ్లిసిటీ విధానం చాల బాగుందిగా..!

Tue 28th Feb 2017 04:28 PM
balakrishna,director trivikram,charmi,balakrishna 101 movie,casting call  పూరి... పబ్లిసిటీ విధానం చాల బాగుందిగా..!
పూరి... పబ్లిసిటీ విధానం చాల బాగుందిగా..!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - పూరి కాంబినేషన్ మూవీ అంటూ పెద్ద షాక్ ఇచ్చారు సినీప్రియులకి. అసలు పూరి గురించి తెలిసే బాలకృష్ణ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడా? పూరి బాలకృష్ణ ని హ్యాండిల్ చేయగలడా? బాలకృష్ణ కి పూరి స్టయిల్ నచ్చుతుందా? అమ్మో ఇలా చాలా రకాల ప్రశ్నలతో టాలీవుడ్ అంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక అలా మూవీ ఎనౌన్సమెంట్ వచ్చిందో లేదో అప్పుడే ఆ సినిమా గురించి హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే ఒక కథని బాలయ్యకి వినిపించి ఓకె చేయించుకున్న పూరి ఇప్పుడు మిగతా కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నాడని చెబుతున్నారు. అయితే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని ప్రచారం జరుగుతుండగా..... ఆ హీరోయిన్స్ వీరే అంటూ మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. పూరి - బాలయ్య కాంబినేషన్ చిత్రంలో నయనతార, త్రిష, శ్రియ నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది..

అయితే ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ పూరి కాంపౌండ్ నుండి ఛార్మి కౌర్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి నటీనటులు కావాలని  పూరి ఇచ్చిన ప్రకటనని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హీరోయిన్ ఛార్మి, పూరి తో కలిసి ఇలా సినిమాలకు సంబందించిన కార్యక్రమాల్లో ఈ మధ్యన ఫుల్ బిజీ అయ్యింది. ఎలాగూ హీరోయిన్ గా ఛాన్స్ లు లేక ఖాళీగా ఉండడం ఎందుకు అనుకుందేమో పూరి తో కలిసి ఇలా సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటూ కాలం గడిపేస్తుంది ఛార్మి. ఇక ఇప్పుడు బాలయ్య - పూరి చిత్రానికి ఛార్మి అన్ని తానై వ్యవహరిస్తూ ఇలా ప్రకటనలు పబ్లిసిటీ చేస్తుంది. 

అయితే పూరి, బాలయ్య చిత్రానికి కొత్తవాళ్ళని తీసుకుంటున్నట్టు ఈ కాస్టింగ్ కాల్ ప్రకటన చూస్తుంటే అర్ధమవుతుంది. ఇద్దరు హీరోయిన్లు, విలన్, ఇంకా ఇతర కేరెక్టర్స్ కోసం మొత్తం 12 మంది కావాలని ఈ ప్రకటనలో వుంది. అంటే ఈ సారి బాలకృష్ణ కొత్త హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నాడనే ఈప్రకటన చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక ఈ చిత్రం మర్చి 9న పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టుకుని నిర్విరామంగా షూటింగ్ జరుపుకుని సెప్టెంబర్ 29న విడుదల చెయ్యాలని పూరి ప్లాన్ చేస్తున్నాడు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ