Advertisementt

తాప్సి కెరీర్‌లోనే బెస్ట్‌ అంటున్నారు..!

Mon 27th Feb 2017 08:31 PM
heroine taapsee pannu,ghazi movie,rana,na peru shabana movie  తాప్సి కెరీర్‌లోనే బెస్ట్‌ అంటున్నారు..!
తాప్సి కెరీర్‌లోనే బెస్ట్‌ అంటున్నారు..!
Advertisement
Ads by CJ

ఇటీవల రానా హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఘాజీ' చిత్రం మంచి కలెక్షన్లు, ప్రశంసలు పొందుతున్నప్పటికీ ఈ చిత్రంలో తాప్సి పోషించిన పాత్రపై మాత్రం విమర్శలు వచ్చాయి. తాప్పి ఆ పాత్రను ఎందుకు చేసిందా? అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇక తాజాగా తాప్సి నటించిన చిత్రం 'నామ్‌ షబానా' చిత్రం హిందీలో తెరకెక్కుతోంది. 'బేబి' చిత్రంలో తాప్సి పోషించిన షబానా పాత్రకు ప్రీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో తాప్సి, అక్షయ్‌కుమార్‌, అనుపమ్‌ఖేర్‌ వంటి వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నీరజ్‌ పాండే కథ, స్క్రీన్‌ప్లేలను అందిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ 'నా పేరు షబానా' తెలుగు టీజర్‌ కూడా విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో తాప్పి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఓ నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ఏజెంట్‌గా నటిస్తోంది. దేశరక్షణ కోసం ఆమె చేసిన వీరోచిత పోరాటాలు, యాక్షన్‌ సీన్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ చిత్రం తాప్సి కెరీర్‌లో ఓ మైలురాయిగా మిగిలుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ మార్చి 31న ఒకేసారి భారీ ఎత్తున రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ