Advertisementt

ఈ హీరో లౌక్యంలో అందరినీ మించిపోతున్నాడు..!

Mon 27th Feb 2017 10:58 AM
sai dharam tej,venkatesh,balakrishna,nagarjuna  ఈ హీరో లౌక్యంలో అందరినీ మించిపోతున్నాడు..!
ఈ హీరో లౌక్యంలో అందరినీ మించిపోతున్నాడు..!
Advertisement
Ads by CJ

మెగా మేనల్లుడిగా పరిచయమైన మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌ తన లౌక్యంతో అదరగొడుతున్నాడు. అందరినీ కలుపుకొని పోతన్నాడు. తన కెరీర్‌కు అందరూ స్టార్స్‌ని, ఫ్యామిలీ అభిమానులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో.. పెద్దగా టాక్‌ లేని ఆయన చిత్రాలు డీసెంట్‌ ఓపెనింగ్స్‌ను సాధిస్తున్నాయి. ఈ విషయంలో ఆయన అందరి హీరోల ఫ్యాన్స్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం ఆయనకు సత్ఫలితాలనే ఇస్తోంది. ఇప్పటికే ఆయన మెగాహీరోలతో పాటు ఘట్టమనేని, నందమూరి, అక్కినేని, మంచు ఫ్యామిలీలను కలుపుకుపోయాడు.

ఇక తాజాగా సాయి సీనియర్‌ స్టార్స్‌ అయిన బాలయ్య, నాగ్‌, వెంకీలను గోల్‌గా చేసుకున్నట్లు కనిపిస్తోంది. సమంత ద్వారా అక్కినేని ఫ్యామిలీని, జూనియర్‌ ద్వారా నందమూరి వారిని ఆకర్షించిన ఆయన ఇప్పుడు ఏకంగా నాగ్‌, బాలయ్య, వెంకీలను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో తన ఎత్తుగడలతో ఔరా అనిపిస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ, ఓ నటుడు వంద చిత్రాలలో నటించాడంటేనే ఆయన సమ్‌థింగ్‌ స్పెషల్‌ అని చెప్పాలి. కొన్నేళ్ల కిందట బాలయ్యకు వరుసగా ఫ్లాప్‌లు వచ్చాయి. 

అయినా ఆయన పట్టువీడలేదు. సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌ను కోల్పోలేదు. తన నుంచి ది బెస్ట్‌ ఇవ్వడానికే కృషి చేస్తున్నాడు... అని తెలిపాడు. ఇక నాగ్‌ సార్‌ స్లైలింగ్‌, స్టేట్‌మెంట్స్‌, ఆయన ఫిజిక్‌ ఫిట్‌నెస్‌, డివోషనల్‌చిత్రాలలో ఆయన నటన తనకు చాలా ఇష్టమని తెలిపాడు. ఇక వెంకీగారిలోని పాజిటివ్‌ థింకింగ్‌, సింప్లిసిటీ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన వెల్లడించాడు. ఇక్కడ బాలయ్య, నాగ్‌, వెంకీల గురించి పొగిడినంత మాత్రాన ఆయా స్టార్స్‌కు ఇప్పుడు సాయి వంటి వారి పొగడ్తలు అవసరం లేదు. కానీ సాయి మాత్రం తన సమయస్ఫూర్తి, లౌక్యంతో అందరినీ ఆకట్టుకున్నాడనే చెప్పాలి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ