ఈమధ్యకాలంలో బయోపిక్‌లకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో వర్మతో పాటు పలువురు అదే దారిలో నడుస్తున్నారు. ఇక ఇటీవల వచ్చిన 'దంగల్','జాలీఎల్.ఎల్.బి౨', 'రాయిస్', 'రంగూన్'చిత్రాలపై కూడా కొన్ని విమర్శలు చెలరేగుతున్నాయి దాంతో కేంద్రం, ఫిల్మ్‌బోర్డ్‌లు తాజాగా ఓ నిబంధన విధించారు. ఎవరైనా నిజమైన వ్యక్తుల జీవిత చరిత్రలు, వారి క్యారెక్టర్లను దృష్టిలో పెట్టుకుని, కల్పిత కథలను చిత్రాలుగా తీసేవారికి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు ఇక నుంచి అలాంటి చిత్రాల విడుదలకు, చివరకు ట్రైలర్‌ను సోషల్ మీడియాలో ప్రదర్శించేందుకు కూడా ఎవరి జీవితం ఆధారంగా చిత్రం తీస్తున్నారో వారి నుండి లేదా వారి కుటుంబసభ్యుల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్‌ను తెచ్చుకోవాలనే షరత్తును విధించారు.
ఇక వర్మ తీసిన 'సర్కార్' చిత్రాలకు శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే జీవితమే స్ఫూర్తి అనేది బహిరంగ రహస్యమే. దీంతో ప్రస్తుతం వర్మ అమితాబ్‌తో తీస్తున్న 'సర్కార్3'కి కూడా ఉద్దవ్‌రాక్రే, రాజ్‌ఠాక్రే వంటి వారి నుంచి ఎన్‌వోసీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి వీరిద్దరూ ఈ తాజా చిత్రానికి నిరభ్యంతర పత్రం ఇస్తారా? లేదా? అని అన్ని చోట్లా ఉత్కరఠ రేగుతోంది. మరి ఈ చిత్రానికి వారిద్దరు అభ్యంతరం చెబితే సినిమా విడుదల ఆలస్యమైనా, లేక ఆగిపోయినా ఆశ్చర్యం లేదని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. దీంతో వర్మ వంటి వివాదాస్పద దర్శకులకు ఈ నిర్ణయం పెద్ద షాకే అని చెప్పాలి.