Advertisementt

చిరుని పవన్ బీట్ చేశాడు..!

Fri 24th Feb 2017 03:39 PM
chiranjeevi,pawan kalyan,katamarayudu teaser  చిరుని పవన్ బీట్ చేశాడు..!
చిరుని పవన్ బీట్ చేశాడు..!
Advertisement
Ads by CJ

ఏదైనా ఒక సినిమా టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంది అంటే ఆ టీజర్ కి ఎన్ని లైక్స్, వ్యూస్ వచ్చాయో అని అటు అభిమానుల దగ్గరనుండి సగటు ప్రేక్షకుడు వరకు తెగ ఎదురు చూస్తున్నారు... ఈ మధ్య  కాలంలో. మా హీరో టీజర్ కి ఇన్ని వ్యూస్ వచ్చాయి అంటే..... మా హీరో టీజర్ కి ఇన్నివ్యూస్  వచ్చాయి అని ఫ్యాన్స్ తెగ డబ్బా కొట్టుకుంటున్నారు. అయితే ఆ వ్యూస్ అటు బాలీవుడ్ నుండి ఇటు సౌత్ వరకు హీరోల కెపాసిటీని ఆ టీజర్స్ మాత్రమే డిసైడ్ చేసేటట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు యూట్యూబ్ సంచలనంగా చిరు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150  టీజర్ 7.41 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తుండగా తాజాగా ఆ ఫిగర్ ని దాటేసింది తమ్ముడు పవన్ నటిస్తున్న కాటమరాయుడు టీజర్. ఈ మధ్యనే విడుదలైన ఈ టీజర్ ఇప్పుడు అన్నయ్య చిరు నటించిన ఖైదీ .... టీజర్ వ్యూస్ ని దాటేసి టాప్ ప్లేస్ లో కూర్చుంది. ఇక ఈ టీజర్ 7.74 మిలియన్ల మంది వీక్షించినట్టు చెబుతున్నారు. 

ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ ని అన్నింటీని కాటమరాయుడు టీజర్ క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. ఇక రెండో స్థానంలో చిరు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150  ఉండగా రజినీకాంత్ నటించిన కబాలి చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ మూడో స్థానంలో నిలిచింది. మరి ఈ దెబ్బకి పవర్ స్టార్ స్టామినా ఏమిటో అందరికి అర్ధమైపోయి ఉండాలి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ