Advertisementt


అబ్బా.... అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌...!

Sun 19th Feb 2017 09:34 PM
akkineni fans,nagarjuna,akhil,naga chaitanya,akhil second movie  అబ్బా.... అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌...!
అబ్బా.... అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌...!
Advertisement
Ads by CJ

'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా' తర్వాత అక్కినేని అభిమానులకు పెద్దగా గుడ్‌ న్యూస్‌లు రాలేదు. నాగ్‌ నటించిన 'ఊపిరి' చిత్రానికి ప్రముఖుల ప్రశంసలు లభించినప్పటికీ ఆ చిత్రాన్ని కాస్ట్‌ఫెయిల్యూర్‌గా తేల్చారు. చివరకు ఈ విషయమై దర్శకుడు వంశీపైడిపల్లి, నిర్మాత పివిపికి మాటల యుద్దం జరిగి సీన్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక అఖిల్‌ తెరంగేట్రం మూవీ 'అఖిల్‌' డిజాస్టర్‌గా నిలిచింది. నాగచైతన్య నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్‌' చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్ద ఫలితాలను రాబట్టలేకపోయాయి. ఇక తాజాగా నాగ్‌ నటించిన మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' కలెక్షన్లు కూడా సరిగాలేవు. ఈ సమయంలో కేవలం అఖిల్‌, నాగచైతన్యల ఎంగేజ్‌మెంట్‌లు మాత్రమే కాస్త అనందాన్నిచ్చాయి. అఖిల్‌ రెండో చిత్రానికి అనేక దర్శకులను పరిశీలించి చివరకు 'మనం' వంటి క్లాసిక్‌ను ఇచ్చిన విక్రమ్‌ కె.కుమార్‌కు అవకాశం ఇచ్చారు. 

కానీ ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో అర్దంకాక తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఇప్పటికే విక్రమ్‌ చెప్పిన ఓ స్టోరీ నచ్చినప్పటికీ ఆ చిత్రం స్టోరీ సెకండాఫ్‌ పలు అనుమానాలు కలిగే విధంగా ఉండటంతో ఆయన్ను మరో స్టోరీ తయారు చేయమని చెప్పినట్లు నాగ్‌ ఆమధ్య తెలిపాడు. ఇక అఖిల్‌, చైతుల పెళ్లిళ్లు కూడా దాదాపు మే నెల, ఆ తర్వాత మాత్రమే ఉంటాయని టాక్‌. దీంతో అఖిల్‌ పెళ్లి వరకు ఆయన నటించే రెండో చిత్రం పట్టాలెక్కే అవకాశం లేదని చాలామంది భావించారు. తాజాగా అక్కినేని అభిమానులకు నాగ్‌ ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. అఖిల్‌ రెండో చిత్రం వచ్చే నెలలోనే అంటే మార్చిలోనే ప్రారంభం అవుతుందని ప్రకటించాడు. మొత్తానికి ఈ వార్త చాలా మందికి సంతోషం కలిగించింది. ఇక ఈ చిత్రాన్ని నాగ్‌ తమ సొంత బేనర్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించనున్నాడు. అఖిల్‌ సరసన మేఘా ఆకాష్‌ నటించనుంది. మిగిలిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ