Advertisementt

ఈ కుర్ర హీరో డేరింగే.. డేరింగ్..!

Sun 19th Feb 2017 01:03 PM
sharwanand,sankranthi race,young hero,summer race  ఈ కుర్ర హీరో డేరింగే.. డేరింగ్..!
ఈ కుర్ర హీరో డేరింగే.. డేరింగ్..!
Advertisement
Ads by CJ

ఈ మధ్యకాలంలో హీరో శర్వానంద్‌ బాగా దూకుడు పెంచాడు. ఎంత తీవ్రపోటీలోకైనా బరిలోకి దిగి సైలెంట్‌ కిల్లర్‌గా మారిపోతున్నాడు. ముఖ్యంగా 'రన్‌ రాజా రన్‌' నుండి ఈ తెగింపు మరింత ఎక్కువైంది. సినిమాలో దమ్ముంటే ఎంత పోటీలోనైనా నెగ్గగలమనే ధీమా ఆయనలో పెరిగిపోతోంది. తీవ్రపోటీలో కూడా వరుసగా రెండో సంక్రాంతికి బరిలో దిగి విజయం సాధించాడు. ఇక సమ్మర్‌ను కూడా ఆయన వదిలిపెట్టడం లేదు. 'రన్‌ రాజ రన్‌', 'ఎక్స్‌ప్రెస్‌రాజా', 'శతమానం భవతి' చిత్రాలతో మంచి హిట్లు కొట్టాడు. దర్శకులుగా కొత్తవారికి అవకాశం ఇస్తున్నప్పటికీ నిర్మాతలుగా మాత్రం యువిక్రియేషన్స్‌, దిల్‌రాజు వంటి అనుభవం, సినిమాను బాగా ప్రమోట్‌ చేయగలిగిన వారిని ఎంచుకుంటూ చక్కని ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నాడు. 

ఇక ఈ సంక్రాంతికి చిరు, బాలయ్యలను ఎదుర్కొని 'శతమానం భవతి'తో వచ్చిన శర్వా.. ఇక తాజాగా సమ్మర్‌లో కూడా పోటీకి దిగడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన చంద్రమోహన్‌ అనే నూతన దర్శకునితో చిత్రం చేస్తున్నాడు. దీనిని బడా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఇందులో ఆయన పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. యాక్షన్‌తోపాటు మంచి ఎమోషన్స్‌ ఉండే కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈచిత్రం రూపొందుతోంది. ఇక ఇందులో శర్వా సరసన లావణ్యత్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం టాకీపార్ట్‌ ఇప్పటికే పూర్తయింది. ఈనెలలోనే పాటలను చిత్రీకరించనున్నారు. ఇక 'కాటమరాయుడు, బాహుబలి2, గురు' వంటి చిత్రాలతో పోటీ పడి మరి దీనిని సమ్మర్‌ రేసులోకి దించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. మరోవంక మారుతి దర్శకత్వంలో ఆయన నటించనున్న 'మహానుభావుడు' మీద కూడా ఎన్నో అంచనాలున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ