Advertisementt

ఈ నిర్మాత టార్గెట్ నెలకో సినిమా..!

Sun 19th Feb 2017 12:23 PM
dil raju,nenu local,monthly movie,shatamanam bhavathi,dil raju planning  ఈ నిర్మాత టార్గెట్ నెలకో సినిమా..!
ఈ నిర్మాత టార్గెట్ నెలకో సినిమా..!
Advertisement
Ads by CJ

నేటితరం నిర్మాతల్లో తనదైన శైలితో దూసుకుపోతున్న నిర్మాతలతో దిల్‌రాజు ముఖ్యుడు. అటు భారీ చిత్రాలతో పాటు ఇటు మీడియం, చిన్నతరహా చిత్రాలను కూడా ఆయన వరుసగా లైన్లో పెడుతూ బిజీ బిజీగా ఉన్నాడు. కథపై, సినిమాలపై తనకున్న పట్టుతో, తనదైన ప్రమోషన్‌తో సినిమాల స్థాయిని మార్చేస్తున్నాడు. కాగా ఈ ఏడాదిలో ఆయన జనవరికి సంక్రాంతి బరిలో ఇద్దరు టాప్‌స్టార్స్‌ పోటీ పడుతున్నప్పటికీ తనదైన ప్లానింగ్‌తో చిన్న చిత్రమైన శర్వానంద్‌ 'శతమానం భవతి'ని పోటీలోకి దింపి విజయం సాధించాడు. ఇక ఫిబ్రవరిలో నానితో 'నేను లోకల్‌' అంటూ వచ్చి రెండో నెలలో కూడా హిట్‌ కొట్టాడు. ఇక వచ్చే నెలలో ఆయన 'వెళ్లిపోమాకే' అనే చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక ఏప్రిల్‌ మొదటి వారంలోనే ది గ్రేట్‌ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న కార్తి చిత్రం 'చెలియా'ను రిలీజ్‌ చేస్తున్నాడు. మేలో ఎలాగూ అల్లుఅర్జున్‌ని దువ్వాడ జగన్నాథంగా చూపిస్తు, హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో 'డిజె'ని రిలీజ్‌ చేయనున్నాడు. ఇలా ప్రతి నెలలోనూ దిల్‌రాజు కనీసం ఒక్క చిత్రమైన తనది ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇదే సమయంలో రవితేజ, రాజ్‌తరుణ్‌లతో సినిమాలు చేయడంతో పాటు మహేష్‌తో కూడా ఓ చిత్రం చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. మొత్తానికి ఈ నిర్మాతను చూస్తే.. సినీ పరిశ్రమ ఇంత ఇబ్బందుల్లో ఉన్న క్లిష్టపరిస్థితుల్లో కూడా తనదైన మార్క్‌ చూపిస్తూ, దూకుడుగా ముందుకు పోతున్న అతనిని మెచ్చుకోకుండా ఉండలేం అన్నది వాస్తవం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ