ఈ అమ్మడు ఈసారి అక్కడ ఛాన్స్ కొట్టేసిందిగా!

Thu 16th Feb 2017 03:08 PM
mega family,mga daughter niharika,nex movie,hero vijay setupathi,heroine niharika,tamil movie  ఈ అమ్మడు ఈసారి అక్కడ ఛాన్స్ కొట్టేసిందిగా!
ఈ అమ్మడు ఈసారి అక్కడ ఛాన్స్ కొట్టేసిందిగా!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లోకి మెగా ఫ్యామిలీ నుండి ఒకే ఒక్క అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుండి హీరోలు సినిమాలకు పరిచయమవ్వడమేగాని ఇంతవరకు హీరోయిన్స్ గా వచ్చినవారెవరు లేరు. అయితే నాగబాబు కూతురు నిహారిక 'ఒక మనసు' చిత్రంతో టాలీవుడ్ లోకి సింపుల్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఇక నిహారికకు మెగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసింది. లోపలేమనుకున్నాగాని పైకి మాత్రం నిహారిక సక్సెస్ కావాలని శుభాకాంక్షలు తెలిపారు. అయితే నిహారిక 'ఒక మనసు'  చిత్రం తర్వాత సినిమాల్లో బాగా బిజీ అవుతుందని భావించారు అందరూ. కానీ నిహా మాత్రం 'ఒక మనసు' తర్వాత సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చింది. 

ఇక ఇప్పుడు నిహారిక తమిళంలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలోవస్తున్నాయి .నిహారికని విజయ్ సేతుపతి చేస్తున్న ఒక కొత్త చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి అరుముగ కుమార్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందని.... నిహారిక కూడా షూటింగ్ లో పాల్గొంటుందని సమాచారం. అయితే తెలుగులో నిహారిక ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్ లో చేస్తుంది. తెలుగులో సక్సెస్ సాధించినట్లే నిహారిక తమిళంలో కూడా సక్సెస్ సాధించాలని మెగా ఫ్యామిలీ వారు ఆకాంక్షిస్తున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ