Advertisementt

ఈ ప్రేమ జంట ఫస్ట్ లుక్ సూపర్..!

Wed 15th Feb 2017 01:26 PM
naga chaitanya,samantha,valentines day celebrations  ఈ ప్రేమ జంట ఫస్ట్ లుక్ సూపర్..!
ఈ ప్రేమ జంట ఫస్ట్ లుక్ సూపర్..!
Advertisement
Ads by CJ

ఈ వాలెంటైన్స్ డే కి ప్రతి ఒక్కరు తమ తమ సినిమాల  ఫస్ట్ లుక్స్ తో సోషల్  మాధ్యమాలలో సందడి చేశారు. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్న తేడా లేకుండా తమ తమ చిత్రాల లుక్స్ ని విడుదల చేశారు. అయితే అవన్నీ సినిమాల లుక్స్ మాత్రమే. ఇక వాలెంటైన్స్ డే రోజున ఒక జంట మాత్రం ఎక్కడా మీడియాకి దొరకలేదు. వారెవరు అనుకుంటున్నారా ... గత కొంతకాలం గా ప్రేమలో తడిసిముద్దవుతున్న లవ్ బర్డ్స్ నాగ చైతన్య, సమంతలు. ఈ వాలెంటైన్స్ డే ని వారు ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారో అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే వారు మాత్రం ఎక్కడా ఎవరికీ కనబడలేదు.

ఇక వాలెంటైన్స్ డే నాడు కనబడకపోతేనేమి ఆ తర్వాతి రోజు వారు ఆ డే ని ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారో చెప్పేసారు. సమంత వారు గడిపిన ఆనందక్షణాల్ని ఫోటో రూపంలో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ పిక్ లో నాగ చైతన్య ని ప్రేమగా దగ్గరకి తీసుకుని సమంత ముద్దు పెట్టింది. ఇక నాగ చైతన్య మాత్రం ఆ మధుర క్షణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనబడుతుంది. ఇప్పటికే వీరు ప్రేమ పక్షుల్లా విహరిస్తూ జనవరి నెలాఖరులో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక కేవలం పెళ్లి ముహుర్తాలు పెట్టుకుని పెళ్లి చేసుకోవడమే తరువాయి. అయితే ఇప్పుడు సమంత పోస్ట్ చేసిన నాగ చైతన్య - సమంతలు కలిసున్న ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ లాగా పాకిపోయింది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ