యంగ్‌ రెబెల్‌ స్టార్‌ రెచ్చిపోనున్నాడు..!

Wed 15th Feb 2017 12:30 PM
prabhas,baahubali 2 movie,prabhas new movie,uv creations banner,director pame sujeeth  యంగ్‌ రెబెల్‌ స్టార్‌ రెచ్చిపోనున్నాడు..!
యంగ్‌ రెబెల్‌ స్టార్‌ రెచ్చిపోనున్నాడు..!
Sponsored links

2013లో 'మిర్చి' తర్వాత ప్రభాస్‌ నాలుగేళ్లు 'బాహుబలి'లోనే గడిపాడు. ఇక తాజాగా ఆయన యూవీ క్రియేషన్స్‌ బేనర్‌లో 'రన్‌ రాజా రన్‌' ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని లాంచనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం మాత్రం 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' విడుదల తర్వాత అంటే మే నెలాఖరులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రాన్ని కూడా దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రభాస్‌ కెరీర్‌లో మరింత ప్రెస్టీజియస్‌గా దీనిని తీయనున్నారు. ఈ మూవీ ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందనుంది. ఇక ఈ చిత్రానికి కూడా టాప్‌ టెక్నీషియన్స్‌ వర్క్‌ చేయనుండటం విశేషం.

'మిర్చి, శ్రీమంతుడు, ఘాజీ' వంటి చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్‌ మది దీనికి కెమెరామెన్‌ కాగా, 'రోబో, బాహుబలి' వంటి చిత్రాలకు డిజైనర్‌గా, సెట్స్‌ డిజైనింగ్‌లో అద్భుతమైన పేరు తెచ్చుకుని, ఇప్పటికే జాతీయ స్థాయిలో నాలుగు సార్లు అవార్డులను అందుకున్న సాబు శిరిల్‌ ఈ చిత్రానికి పనిచేయనున్నాడు. మరోవైపు బాలీవుడ్‌ సంచలన మ్యూజిక్‌ త్రయం శంకర్‌, ఇహసాన్‌, లోయ్‌లు సంగీతం అందిచనున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై నిజంగానే అంచనాలు పెరిగాయి. ఏదో మన టెక్నీషియన్స్‌నే పెట్టుకుని బాలీవుడ్‌లో కూడా తీస్తున్నాం.. అనే బిల్డప్‌ని ఇవ్వకుండా నిజంగానే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించేలా, ప్రభాస్‌ రేంజ్‌ను తెలుగుతో పాటు తమిళ, హిందీ పరిశ్రమలలో కూడా చాటేలా ఈ చిత్రాన్ని తీయడానికి, దానికి ఎంత ఖర్చుకైనా వెనుదిరగని తన సొంత నిర్మాణ సంస్థ అయిన యువిక్రియేషన్స్‌తో ప్రభాస్‌ దీనికి సర్వసన్నద్దం కానుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా కూడా ఓ ప్రముఖ బాలీవుడ్‌ క్రేజీ నటిని సంప్రదిస్తున్నారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019