Advertisementt

షారుఖ్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు..!

Sun 12th Feb 2017 12:16 PM
bollywood,shahrukh khan,amir khan,salman khan,shahrukh and amir khan selfie photo  షారుఖ్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు..!
షారుఖ్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకు ఉన్నక్రేజ్ మరే ఇతర హీరోలకి లేదు. వీరి ముగ్గురిని దాటుకుని ఒక్క హీరో కూడా ముందుకు వెళ్లలేక పోతున్నాడు. గత 25  ఏళ్ళ నుండి వీరు బాలీవుడ్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుని ఏక ఛత్రాధిపత్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలుతున్నారు. ఇక వీరి మధ్యన మాత్రం స్నేహ పూర్వక సంబంధాలు లేవనేది జగమెరిగిన సత్యం. అయితే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు మొదటినుండి మంచి ఫ్రెండ్స్. కానీ షారుఖ్ ఖాన్ కి మాత్రం అమీర్ తో సల్మాన్ తో ఎప్పుడు విభేదాలు ఉండేవి. 

అయితే ఈ మధ్యన ఉన్నట్టుండి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ఫ్రెండ్స్ అయిపోయి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక అప్పటినుండి వీరిద్దరూ ప్రతి పార్టీలో కలిసి ఎంజాయ్ చేస్తూ మంచి మిత్రలుగా కొనసాగుతున్నారు. అయితే తాజాగా షారుఖ్ ఖాన్, అమీర్ తో కూడా విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు ఈ సెల్ఫీ చూస్తుంటే అర్ధమైపోతుంది. సెల్ఫీ నే కాదు షారుఖ్, అమీర్ ఖాన్ ని ఉద్దేశించిన ట్వీట్ కూడా ఇప్పుడు సంచలనాత్మకం అయ్యింది. ‘పాతికేళ్లుగా అమీర్ ఖాన్ నాకు తెలుసు... నేను అమిర్ కి తెలుసు. కానీ, మేమిద్దరం కలిసి ఓ ఫోటో దిగడం ఇదే మొదటిసారి. వాటే ఫన్‌ నైట్‌’ అంటూ ట్వీట్ చేసి వీరిద్దరూ ఉన్న ఒక ఫోటో ని పోస్ట్ చేసాడు.ఇక ఇప్పుడు ఆ సెల్ఫీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ లా పాకిపోయింది. మరి ఖాన్ లు ముగ్గరు ఇలా మంచి మిత్రులైపోతే బాలీవుడ్ కి కూడా ఆహ్లదకర వాతావరణం వచ్చినట్లే అని భావిస్తున్నారు సినీప్రేమికులు.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ